ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

-దైవ ఆరాధన లో లింగ వివక్షతకు చోటు లేదు - సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా - పూర్తి జడ్జిమెంట్ -అ మతాధికారి మను కాదు కదా ?



     


writ petition No 373/2006, ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ మరియు ఇతరులు  vs ది స్టేట్ అఫ్ కేరళ  భారత దేశం లో స్త్రీ యొక్క ప్రముఖ్యత, లింగ వివక్షత గురించి క్లుప్తముగా చర్చించిన కేసు. ది28-09-2018 వ తేదిన భారత దేశాన్ని ఒక నూతన శకానికి  ఆహ్వానం పలుకుతూ  ఇచ్చిన ఈ తీర్పు చరిత్ర లో మిగిలిపోతుంది. 411 పేజి లు ఉన్న దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన  ఈ జుడ్జిమేంట్ లో జస్టిస్  దిపక్ మిశ్ర గారు మరియు ఏ .ఏం.ఖాన్ విలకర్ గారి 95 పేజి లా జుడ్జిమేంట్ విశ్లేషించటం జరుగుతుంది.


తరాలనుంచి ఆడవారు వివక్షత కి గురి అవుతున్నారు, చాలామంది ఇప్పటికి వారి హక్కుల గురించి పోరాడుతున్నారు. సుసాన్ బి అంటోనీ స్త్రీ సానుభూతిపరుడు ఈ విధముగా చెప్పారు మొగవారి ,' హక్కులు,  ఎక్కువేమి  కాదు, ఆడవారు వారి హక్కులు తక్కువేమీ  కాదు".

దైవత్వ భక్తీ లక్షణం లింగ వివక్షత చూపించటం కాదు. :  భారత దేశం లో  మతధికారులు ద్వంద ధోరణి ఆచరిస్తున్నారు, ఒక వైపు స్త్రీని దేవత లా కొలుస్తూ మరో వైపు వారి పైన వివక్షత చూపిస్తూ, కఠినమైన  ఆంక్షలు విదిస్తున్నారు. అటువంటి వివక్షత ఆంక్షలు రద్దు చెయ్యాలి.. అటువంటి ద్వంద వైఖరి మనిషి మానసిక స్థితి పైన ప్రభావం చూపిస్తుంది, వారి ఆలోచన వారి ఆలోచన ధోరణి మర్చి స్త్రీ ని అవమాన పరిచే విధముగా వారి మనోభావాలు దెబ్బ తినే విధముగా ఉన్న మత ఆచారాలు మార్చాలి అనే విధముగా అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఆలోచన ధోరణి మారాలి : సమాజం స్త్రీల పైన ఆధిపత్య ధోరణి, వివక్షత భావాలను మార్చు కోవాలి అని సూచించారు, కేవలం ఆడవారి నుంచే పవిత్రతను, స్వచ్ఛతను ఆశించే ఆలోచన మార్చుకోగలిగితే స్త్రీ సమానత్వానికి ప్రాముఖ్యతకి, ఆడవారు మగవారిలాగే భావ స్పందన కలిగి ఉంటారు అనే విషయం మరవకూడదు. ఈ విధముగా మాత్రమే సమాజంలో తక్కువ ఎక్కువ అనే భేదాలు లేకుండా మానవత్వం మనుగాడలోకి వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

కేరళ హిందూ ప్లేసెస్ అఫ్ పబ్లిక్ వర్షిప్ 1965 లో సెక్షన్ లు మరియు రూల్స్ ఉన్నాయి. అయితే సెక్షన్ 3 ప్రకారం దేవుడిని పూజించే ప్రతి చోటకి వివక్షకి తావు లేకుండా ప్రతి ఒక్కరు వెళ్ళవచ్చు

ఇదే యాక్ట్ లో రూల్ 3(బి) ప్రకారం స్త్రీలు ఎపుడైతే సంప్రదాయాలు నిర్దేశించిన సమయములు ఆరాధన కి రాకుడదో వారు రూల్ 3 నిర్దేశించిన ప్రదేశాలకి వెళ్ళకూడదు.

సుప్రీమ్ కోర్ట్ వారు సెక్షన్ మాత్రమే వర్తిస్తుంది, రూల్స్ సెక్షన్ అనే వేత్యేసం వచ్చినప్పుడు సెక్షన్ మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి రూల్ 3 ని రాజ్యంగ విరుద్ధముగా అప్పీల్ ని అంగీకరించారు. 

చాలామంది మనువాదులకి ఈ విషయం మింగుడు పడటం లేక అత్యున్నత న్యాయ స్థానం పైనే విమర్శలు కురిపిస్తున్నారు. దయ చేసి జుడ్జిమేంట్ పూర్తిగా చదవండి, అందరి జడ్జి లా అభిప్రాయాలు చదవండి - వ్యతిరేకించిన వారు కూడా స్త్రీ పైన లింగ వివక్షత గురించి క్లుప్తముగా విశ్లేషణ చేసారు - మనువాదులు దయ చేసి ఒక్కసారి చూసి ఇకనైన వ్యవహార శైలి మార్చుకోవాలి అని ఆశిస్తూ (మనువాదులకి) విన్నపం









 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement