ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రైతు సమస్యలు ముఖ్యమంత్రి ఎదుట ప్రస్థావన లోకి తీసుకోని వచ్చిన పితల సుజాత




   
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం, చింతలపూడి గ్రామంలో జరిగిన ముఖ్యమంత్రి గ్రామదర్శిని సభ లో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యురాలు పితల సుజాత గారు తన ప్రశంగం లో ఇక్కడ చింతలపూడి  రైతులకి లిఫ్ట్ ఇరిగేషన్  సమస్య ఉంది దాన్ని సహృదయం తో పరిష్కరించాలి  అని విన్నపం చేసారు, అలాగే పామయాల్   రైతుల సమస్య కూడా ఉంది అని వారి సమస్య పైన సానుకులముగా స్పందిన్చవలిసింది గా ఆమె ముఖ్య మంత్రి గారికి విన్నపించారు, అలాగే మున్నేరు వాగు గురించి కూడా ఆమె ప్రస్థావన లోకి తీసుకోని వచ్చారు. ప్రతిపక్ష పాత్రా కూడా ఆమె వహించి రైతుల సమస్యలు గురించి ముఖ్యమంత్రి గారి ఎదుట  ప్రస్తావనలోకి ఈ సమస్యలు తీసుకోని రావడం ప్రశంసనీయం. కానీ నిర్బందనల విషయం  లో నే  తొందరపడ్డారు అనే అభిప్రయాలు లేక పోలేదు  - కొంత మంది అత్యుత్యహా పోలీస్ వారు ప్రజానాయకుల ఇంటి వెలుపలకీ వెళ్ళి ఇబ్బంది పెట్టడం - అవసరం లెని హడావిడి చెయ్యటం వలన విమర్శలకు గురియ్యారు.


బోయగూడెం లో రివ్యూ ప్రోగ్రాం బాగా జరిగింది అనేది పబ్లిక్ టాక్. ముఖ్య మంత్రి రివ్యూ కోరుతున్న సమయంలో " అధికారులు మిమ్మల్ని ఇలాగ చెప్పమని చెప్పరా, భయపడకండి వాస్తవం చెప్పండి అని అనడంతో " ప్రజలా మెప్పు పొందారు.  అప్పటికప్పుడు 10 కోట్లు సేనక్షన్ చెయ్యమంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ప్రజలని ఆశ్చర్యర్ధకులను చేసింది.

100 పడకల ఆసుపత్రి గురించి  ప్రజానీకం ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన వాగ్ధానాలు  సక్రమంగా అమలు పరిస్తే  2019 ఎన్నికలలో వ్యతిరేకత ఉన్నవారి మన్ననలు పొందే అవకాశాలు ఎక్కువ.







 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement