ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఏలూరు లో నారయణ జూనియర్ కాలేజీ ని నిలతిసిన PDSU - విద్యార్ధులకి విముక్తి




ప్రెజర్ పెరిగి ఆత్మహత్యలకు పలుపడుతున్న విద్యార్ధుల అవస్థ అందరికి తెలిసిందే . ఫారం కోడిని పెంచిన విధముగా చదువే లోకం రేంకులే సరవస్వం అని భావించే తల్లి తండ్రులు ఈ ఆత్మహత్యలలో కొంత పాత్రా పోషిస్తే, చేపని రుద్దే విధముగా రుద్దుడు కార్యక్రమానికి పూనుకున్న కార్పొరేట్ విద్య సంస్థ లు ముఖ్య పాత్రా పోషిస్తున్నవి.  క్రిడలకి దూరముగా, సభ్య సమాజానికి సంబంధం లేకుండా ఉదయం 8 గంటలనుంచి రాత్రి 10 గంటలవరుకు భట్టి కార్యక్రమం చేపట్టిన కార్పొరేట్ సంస్థలకు PDSU ఒక సింహ స్వప్నం అనే చెప్పాలి - ఒక రకంగా విద్యార్ధుల తల్లి తండ్రుల పాత్రా వారు పోషిస్తునట్టు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో నారయణ జూనియర్  కాలేజీ ప్రభుత్వ నిభందనలకు
విరుద్ధముగా రెండవ శనివారం తరగతులు నిర్వహిస్తున్నారు అనే సమాచారం తెలుసుకున్న PDSU సభ్యులు అక్కడ కి చేరుకొని నోరు మెదపలేని విద్యార్దుల గొంతు వారుగా పలికారు వారికీ అ శనివారం విముక్తి ని కలిగించారు.

రెండవ శనివారం సెలవు అవసరమా ? అవసరమే మానవ సంబంధాలు సన్నగిల్లుతున్న రోజులు ఇవి, ఉదయాన్నే 8 గంటలకే కొన్ని కార్పొరేట్ విద్య సంస్థలు తరగతులు మొదలు పెడుతున్నవి రాత్రి పది గంటలకు ఇంటికి వెళ్ళటానికి అనుమతిస్తున్నవి ! ఇంకా ఎప్పుడు విద్యార్ధులు తమ కుటుంబం తో సమయాన్ని గడిపేది , ఇతరులతో స్నేహ సంబంధాలు ఎప్పుడు పెంపొందించుకునేది, అసలే క్రీడలకు ప్రాధాన్యత లేని రోజులు ఇవి కనీస వ్యాయమ ప్రక్రియ లేకుండా గుడ్ల మీద కోడ్లు  లాగా అలవాటైన జీవన శైలి తుది వరుకు కొనసాగుతూనే ఉంటుంది. రేపటి తరం వారి మానసిక శారీరక పట్టుత్వం సరిగలేక మానసిక రుగ్మతలకు గురి అవుతారు. రెండవ శనివారం అవసరమే !     

Advertisement