ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ప్రజా స్వామ్యం మీద ఉక్కుపాదం తో చింతలపూడి ముఖ్యమంత్రి సభ సక్సెస్ - కాలాపానీ సినిమా లో ఖైది లా పరిస్థితి మాదిరిగా......



ఉదయాన్నే వాకింగ్ వెళ్ళి వచ్చిన కమ్యూనిస్ట్  పార్టీ అఫ్ ఇండియా జిల్లా సభ్యులు   మామిళ్లపల్లి వసంత రావు గారిని గృహ నిర్భంద చేసారు కూడి ప్రక్కన మఫ్తీ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ 

ప్రజాస్వామ్యం మీద ఉక్కుపాదం తో చింతలపూడి నియోజకవర్గం లో నేటి ముఖ్యమంత్రి గారి సభ విజయవంతం గా ముగిసింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గృహ నిర్బంధం, కాంగ్రెస్ పార్టీ నాయకులు గృహ నిర్బంధం, ప్రధాన ప్రతిపక్ష వై ఎస్ అర్ పార్టీ నాయకురాలు జానకి రెడ్డి గారిని మరియు ఇతర నాయకులని ఏకంగా స్టేషన్ కి తరలించారు. ప్రజాస్వామ్యం లో ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి పరిస్థితి ఇక చరిత్ర తిరగవేసిన లేదు రాదు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం అంతటకి ముఖ్యమంత్రి ఏదో ఒక పార్టీ కే అయిన ముఖ్యమంత్రి కాదు రాష్ట్రం మొత్తానికి అయిన ముఖ్యమంత్రి.

చింతలపూడి పోలీస్ స్టేషన్ లో నిర్బందనికి గురి అయిన చింతలపూడి  వై ఎస్ అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జానకి రెడ్డి గారు, ఎలిజ గారు ,  మిర్యాల దిలీప్ తదితరాలు    


చరిత్ర తిరగేసి చూస్తే స్వర్గీయ ఎన్ టి రామారావు గారు ప్రతిపక్షాల గోడు ఏమైనా ఉందా ? ఏరి వారు రాలేదే ? అని ప్రశ్నలు ఉండేవి. స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏంటి తమ్ములు ఏమిటి సమస్య? అని ఆప్యాయంగా పలకరించేవారు. కిరణ్ కుమార్ రెడ్డి చింతలపూడి లో కమ్యూనిస్ట్ పార్టీ వారు ఇచ్చిన మెమొరాండం స్వీకరించి సానుకులముగా స్పందించారు. 
ఇంటిలో గృహ నిర్బందనికి గురి అయిన కాంగ్రెస్ పార్టీ నాయుకులు  మరుముడి థామస్ గారు  ఎడమ ప్రక్కన ముఫ్తీ లో ఉన్న పోలీస్ 

మాకున్న సమాచారం మేరకు   చింతలపూడి గ్రామం లో షాప్ లు అన్ని అధికార యంత్రాంగం ముయ్యించి వేసారు - సి ఏం పర్యటన లో భద్రత దృష్ట్యా అన్ని షాప్ లు ముయ్యించి వేసారు. అయితే ముఖ్యమంత్రి గారు షాప్ లు ముసి ఉండటం గమనించి షాప్ లు ఎందుకు ముయ్యించారు అన్ని తెరిపించండి అని సిరియస్ గా చెప్పటం తో షాపులు తెరిపించారు. 


ప్రతిపక్షం స్పందన తెలుసుకోకుండా గ్రామా అభివృద్ధి ఎలాగా తెలుస్తుంది. చింతలపూడి ఎత్తుపోతల పధకం లో భూములు కోల్పోయిన రైతులు ఎవరు సభకు హాజరు కాకుండా చూడటం ఎవరి పని ? 
     
ప్రతిపక్షాలు నోరు తెరిస్తే ఎవరికి ప్రమాదం ? ఇది ముఖ్య మంత్రి పనేన లేదా స్థానిక నాయకుల వ్యవహరమా? అనే విషయం పైన విస్తృత చర్చ జరుగుతుంది. నిజంగానే సభ విజయవంతగా ముగిసిందా ?

కమ్యూనిస్ట్ పార్టీ వారు సామజిక మాధ్యమాల ద్వార చెప్పుకునే గోడు చింతలపూడి లో ఉన్న సమస్యలు. పాలక పార్టీ గృహ నిర్బందం చేసి ఇప్పటికే నియోజకవర్గ ప్రజలలో ఉన్న పోరు నోరు వాచే లాగా విస్తృత గా ఉన్న  చర్చ ని ఇంకా పెద్దది చేసారు.

ప్రతి పక్షానికి సానుభూతి వచ్చే లాగా చేసింది ఎవరు ? అసలు ఏమి చేసారో ఏమైనా అర్ధం అవుతుందా ? 

అసలు సమస్యలు లేని నియోజకవర్గం ఉంటుందా ? ఇంకా చింతలపూడి లో సమస్యలు భయటకు రాకుండా చేసి - అ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టి కి వెళ్ళకుండా చేసి - అ సమస్యలు పరిష్కరించకుండా - ప్రజానాయకులను గృహ నిర్బంధం చేసి ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు ?

సీనియర్ నాయకులు ఇప్పటికే కక్క లేక మింగలేక సొంత పార్టీ భవిష్యత్తు దృష్టి లో పెట్టుకొని తీవ్ర శోకంలో ఉన్నారు.  వారి మౌనం, ఇటువంటి చర్యలు పార్టీ కి తీవ్ర నష్టం. ప్రతి పక్షానికి ఇది ఒక కలిసి వచ్చే అంశం.

చింతలపూడి లో అసలు సమస్యలు లెవ్వ ? ఒక్కసారి చూస్తారా ? ఎన్ని సమస్యలు ఉన్నాయో ? నోరు నొక్కి స్వేచ్చ ని హరించి తాత్కాలిక నిర్భందన తో ఎన్ని రోజులు పాలించగలరు మహా అయితే 2019 ఎన్నికలవరుకు, పవర్ లేని సమయం లో కాలిన కడుపుల కేకలు సామజిక మాధ్యమాలలో విన్న ప్రతిసారి చెవులో సీసం పడితే బాగుండును అనే రితి లో రాత్రులు నిద్ర కూడా కరువు అయ్యేలాగా ఉంటుంది.  సరే నాయకులను గృహ నిర్బందన  చేసారు - మరి సమస్యలను ఎలాగా నిర్భందిస్తారు. వాటికీ గృహ నిర్భందన కుదరదు కదా !

ఇంకొన్ని రోజులలో ఎన్నికలు వస్తున్నాయి ! ఈ సమయములో సున్నం అవసరమా ? వేవ్ ఉంది అని అనుకుంటున్నారా ?  జనసేన పార్టీ చీలిక తో సామజిక ఓట్ల లో చీలికలు తూర్పు గోదావరి , విజయవాడ , విశాఖపట్నం, శ్రీకాకుళం , విజయనగరం. ఇక ముఖ్యముగా చింతలపూడి నియోజకవర్గం పరిస్థితి వేరే వివరించనవసరం లేదు.   వై ఎస్ అర్ కాంగ్రెస్ ప్రజలలో ప్రచారం ముమ్మరం చేస్తుంది.  కావాలంటే సర్వే చేయ్యించుకోండి.

సరే నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి వరుకు చేరనివ్వలేదు ప్రపంచం చూడకుండా అపగలరా ? చూద్దాం ?

ఎవరు ఏమి చేసిన పోలీస్ వారి మీదే భారం మొత్తం - కానీ వారికీ హుకుం జారి చేసినా నాయకులు ఎవరు ? కాలాపానీ సినిమా లో ఖైది లా పరిస్థితి మాదిరిగా ఉంది చింతలపూడిలో  పరిస్థితి.  365 రోజులకు సరిపడా సమస్యలు చింతలపూడి లో ఉన్నాయి ఒక్క చింతలపూడి గ్రామం పరిసరాలలోని సోషల్ నెట్వర్కింగ్ యుసర్స్ రెండు లక్షలు మంది ఇంకా నియోజకవర్గం లో యెంత మంది ఉండి ఉంటారు? ఒక విషయం ఒక మనిషికి తెలిస్తే సైన్సు ప్రకారం 8 మందికి తెలుస్తుంది ఇప్పుడు ఆపండి చింతలపూడి సమస్యలను ముఖ్యమంత్రి వరుకు వెళ్ళకుండా . పాత రోజులలో లాగా  ప్రజాస్వామ్యం మీద ఉక్కుపాద చర్యలు చెల్లుబాటు అవ్వవు ఇప్పుడు, సామజిక మాధ్యమాల ద్వార ఎక్కడ ఏమి జరిగిన వెంటనే ప్రజలకు ప్రాధమిక సమాచారం అందుతుంది జరా భద్రం. 






 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement