ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి లో కోమటి కుంట చెరువు జాడ లేదు



     



చెరువు ని ఆక్రమించిన వారి పేరులు నమోదు చేసి, వారి ఆర్ధిక స్థిత గతులు గురించి విచారణ చేసి నిజమైన పేదవాళ్ళకు   ప్రత్యామ్న్యాయం చూపించి చెరువు విస్తరించే కాపాడే పని కి ప్రభుత్వం పూనుకుంటే ఎవరికి అభ్యంతరము ఉండదు. భూమి లేని వారు అ భూములని సాగు చేసుకుంటునప్పుడు, అక్కడ సాగు చేసుకుంటున్న వారిని నిజమైన పేదవారిగా గుర్తించి వారికీ అసైన్డ్ లాండ్స్ అసైన్ చేస్తే మంచిది - అసైన్మెంట్ లాండ్స్ యొక్క పర్పస్ అదే కాబట్టి. భూమి ఉండి కూడా  బలిసి ఆక్రమించుకున్న వారి పైన ఎద విధిగా యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం పైన ఎటువంటి ఆక్షేపణ ఉండదు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లో చేరువులని పర్యవిక్షించావలిసిన ఉన్నత అధికారులు చోద్యం చూస్తున్నార ? కొన్ని చెరువులు ఇప్పటికి ఆచూకి లెవ్వు కోమటి కుంట చెరువు కనుమరుగు,గుర్రాజు గుంట మరియు పెద్ద చెరువు పరిసర ప్రాంతాలని కలుషితం చెయ్యటం. అసలు చింతలపూడి  పంచాయతి కి రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల వ్యయం తో  ఒక డంపింగ్ యార్డ్ సేనక్షన్ చేసింది, కానీ పంచాయతి వారు ఉన్న స్థలలని దేవుడు పేరు తో దానం చేసి ఇప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసుకొని పరిస్థితి ఏర్పడింది.


సర్వే నెంబర్ 303 లో 5.90 ఎకరాలు లో ఉన్న కోమటి కుంట చెరువు జాడలు లెవ్వు ఇప్పుడు దిని పైన అధికారుల స్పందన లేదు, అలాగే మొహిద్దినకుంట కూడా ఆక్రమణ కి గురి అయ్యింది, బోయగూడెం పెద్ద చెరువు కూడా అదే పరిస్థితి.  శేట్టివారిగూడెం లో ఒక చెరువుని ఒక ఉన్నత అధికారి తరుపున వారు  ఆక్రమించి రోడ్డ్ వేసుకుంటే అ చెరువు ఆధారిత రైతులు సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు లెవ్వు.

అసలు చెరువు ఆక్రమిస్తే మీకు ఎందుకు అనుకుంటున్నారా ? చెరువు ఆక్రమించటం వలన కలిగే నష్టం అంత ఇంత కాదు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గి పోయి నిరు ఊరాక మీరు వేసుకున్న బోరులు నిర్వీర్యం అయిపోతాయి, పంట పండించే రైతు కి అందుకు సహకరించే రైతు కూలి లు కరువు ని ఎదురుకోవలసిన పరిస్థితి. వాతావరణ లో మార్పులు, త్రాగటానికి  గ్రామాలలో కూడా నిరు కొన్నుకున్నే పరిస్థితి. వర్షం పడినప్పుడు కట్టలు తెగి వరద వచ్చే ప్రమాదం ఇలాగ ఒక రకముగా కాదు కరువు ప్రాంతానికి కేర్ అఫ్ అడ్రస్ గా అ గ్రామం మిగిలిపోతుంది.

ఈ విషయం పైన స్పందించిన మామిళ్ళపల్లి వసంత రావు గారు, కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా జిల్లా సభ్యులు   మన  పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేసారు, అయిన స్పూర్తి తో ప్రోగ్రెసివ్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ కలుషితనికి గురైన సర్వే నెంబర్ 812 లో 142 -27 ఎకరాల విస్తిరణం లో ఉన్న పెద్ద చెరువు లో ఉరిలో ఉన్న కలుషిత నిరు వదులుతున్నారు, అ పర్యావరణాన్ని చెత్త తో నింపి కలుషితం చేస్తున్నారు, అలాగే గుర్రాజుగుంట సర్వే నెంబర్ 582 లో 8-58 సెంట్ల విస్తిరణం ఉన్న చెరువుని ఇప్పటికే సాగం చెత్త తో పూడ్చిన విషయం, డంపింగ్ యార్డ్ గా వినియోగించి అ చెరువు పర్యవరణం కలుషితం చెయ్యటం జరిగింది అనే విషయాన్ని జాతియా మానవహక్కుల కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడం జరిగింది, అ విషయం పైన మానవ హక్కుల కమిషన్ స్పందించిన ఇక్కడ ఉన్నత అధికారులు స్పందించకపోవటం గమనార్హం ? కొత్తగా వచ్చిన ఏం పి డి ఓ గారు చాల స్ట్రిక్ట్ అని సామజిక మాధ్యమాలలో వినికిడి చూడాలి విరి పని తిరు ఎలాగా ఉంటుంది అనేది.

ఆంధ్రప్రదేశ్  నిరు చెట్టు భూమి క్రింద ఉన్న నిబంధనలు అన్ని తుంగలో తొక్కుతూ అ యాక్ట్ ని నిర్వీర్యం చేస్తున్నారు. నిరు కలుషితం కాకుండా మరియు చెరువు యొక్క సరిహద్దులు నిర్ణయించమన్న సూచనలని తుంగలో తొక్కి పడుతున్నారు.  కొంత మంది అత్యుత్యహులు మాకు వేసిన ప్రశ్న చెరువు లో మురుగు కలిస్తే ఏమవుతుంది ?

స్వయన  ప్రభుత్వం ఈ విషయం పైన ఒక నివిదేక ఇచ్చింది మనుషుల వ్యర్ధాలు, జంతువుల వ్యర్ధాలు, ఇతర వ్యర్ధ పదార్ధాలు చెరువు లో కలిస్తే భూగర్బ జలలో నిట్రేట్ , పొటాషియం, పోస్పాటే అనేవి ఎక్కువ మోతాదు లో  ఎర్పడతవి అవి త్రాగిన  మనిషి కానీ  జంతువూ కానీ, వాటి తో సాగు చేసిన పొలము కానీ, వాటినుంచి ఉత్పత్తి అయిన పంట కానీ ఎంత కలుషితాన్ని కలిగి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.
 

 క్రింద పొందు పరిచిన రిపోర్ట్ లో 41 వ పేజి లో 3 వ పేరా మూడవ లైన్ లో చూడండి . సంపాదిస్తారు కానీ వైద్యానికి తగలేస్తారు, బ్రతికి బట్ట కట్టిన మళ్ళి అదే పరస్థితి. ప్రజలు ప్రతిఘటించే వరుకు  నిప్పు తో కడిగిన  , నిరు తో కడిగిన  జివస్చావలలగా మిగాలసిందే  అది ఇక్కడ స్థితి పరిస్థితి.
   






 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement