ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

కుదిరితే కులాన్నే కనే"వడేమో" .......మారుతీ రావు - ?



     


కూతురుని విధవను చేసాడు, అల్లుడు ని చంపేసాడు చివరిగా ఏడు వుచాలు లెక్క పెడుతున్నాడు , ఏ పరువు కావాలనుకున్నాడో అ పరువు దక్కలేదు, అయిన ఇతను మనిషికే పుట్టాడు కులానికి కాదు అనేది సైన్సు.  మనవడో మనవరాలో తెలియదు కానీ  అనాధాని చేసి జీవితాంతం తండ్రి లేని బాధ మిగిల్చి అ పసి మనసు ముందల దోషి లాగా మిగిలాడు, అ తాత మనీషా జంతువ అనే విషయం అ తల్లి చెప్పలేదు ఎందుకంటె ఆమె దృష్టి లో అ తండ్రి కి పుట్టినందుకు ఆమె జివితంతం పశ్చాతాప పడవలిసిన పరిస్థితి.


ఇప్పుడు ఆలోచించవలిసిన విషయం కులం గురించి ఈ హత్య జరిగిందా లేదా అనే రాజకీయ లబ్ది చర్చలు కాదు. జరిగిన విషయానికి రిజర్వేషన్ కి ఏమైనా సంబంధం ఉందా ?

నిజంగా అగ్రవర్ణం - ఇంకొక వర్ణం అని అలోచించి ఉంటె అ ఆమ్మాయి అతన్ని వాళ్ళ తల్లి తండ్రులను కాదు అని పెళ్లి చేసుకొని ఉండేది కాదు. అంటే ఆమె మనసులో ప్రేమ అనేదే  ఆమె కులం. కులానికి ప్రాముఖ్యత ఇవ్వని అ ఆమ్మాయి ప్రేమకి తన సర్వస్వాన్ని ఇచ్చింది. సమాజాన్ని రెండు వర్గాలు గా చీల్చి ఈ విషయాన్ని ఒక రాజకీయ అంశం గా చిత్రికరించటం ఎంత వరుకు న్యాయం?


 మన దేశ దౌర్భాగ్య స్థితి ఏమిటి అంటే  (ఒకప్పుడు ప్రపంచం అంత ఉండేది ) ఆడవారిని మనిషి గా కాకుండా - పరువు గా భావించటం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.

ఆమృత తండ్రి కి ఒకవేళ కులాన్ని కనే అవకాశం ఉండి ఉంటె కులాన్నే కనేవాడు ఏమో ? పరువు హత్య అయితే ఇరువురు ని చంపించాలి ఇక్కడ అలాగా జరగలేదు -  కొంత మంది అత్యుత్యహులు చెప్పినట్టు కుల హత్య అయిన ఇద్దరు చనిపోయి ఉండాలి - కానీ ఇక్కడ జరిగింది ఉన్మాద చర్య (A sadistic Act) - కూతురు సుఖంగా ఉంటె చూడలేని ఒక తండ్రి ఆలోచనలోనుంచి పుట్టిన ఉన్మాద బిజనికి కార్య రూపం ఈ చర్య.  నా కూతురుకి ఎటువంటి హాని తలపెట్టవద్దు అని చెప్పను అని  పోలీసులకు ఇచ్చిన వంగ్ములన లో అ మృగం యొక్క కోరిక గ్రహించలేర ? ఆమె ఏడుస్తుంటే అతను  చూసి ఆనంద పడతాడు, అ జంట కలిసి ఉంటె అతను తట్టుకోలేడు, తన మాట కాదు అన్న తన కూతురు సుఖంగా ఉండకూడదు . 

జరిగింది అన్యాయమే, అది తీర్చలేని లోటు -  కన్నా కూతురుకి కన్నా తండ్రి చేసిన అన్యాయం - ఒక తాత తన మనవుడు లేదా మనవరాలకి చేసిన అన్యాయం - కళ్ళు తెరిసి లోకాన్ని చూడని ఒక పసి గొడ్డు ముందల కూడా దోషి లాగా నిలపడవలిసినంత అన్యాయం - ఒక ఉన్మాది ఒక తల్లి కి చేసిన అన్యాయం, ఒక మానవ మృగం ఒక తండ్రికి చేసిన అన్యాయం . కులం అనేది మనిషి మానసిక స్థిత గతుల పైన చుట్టూ ప్రక్కల పెరిగే వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది. అమృత మనిషి లో ప్రేమను చూసింది, ప్రణయ లో తను ప్రేమించే మనిషిని చూసింది కానీ ఆమె తండ్రి కులాన్ని చూసాడు. ఇప్పటి ఈ హత్యా కి కులం పేరుతో   "మీట్ " లు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కడు  బాధ్యుడు, అలాగే కులాల పేరుతో  "గర్జన " లు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కడు బాధ్యుడు.  ఇంకా ఈ విషయాన్ని రాజకీయం చేసి జరిగిన పరిణామాన్ని వేరోకరకముగా చిత్రీకరించాలి అని చూసే వారు "మారుతీ రావు" కన్నా  ప్రమాదస్తులు ! జరా భద్రం !

అదే  కులానికి చెందిన అమృత - ప్రణయాని ప్రేమించిది - కులం ప్రస్థావన లేకుండా -అదే  కులానికి చెందిన మారుతీ రావు కులాన్ని ప్రేమించాడు - కూతురి సుఖంతో సంబంధం లేకుండా    - అదే కులాన్ని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు - సమస్యతో సంబంధం లేకుండా. ఈ సమస్య కి ఎకేక పరిష్కారం కుల వ్యవస్థ బహిష్కారం. ఒక మనిషిని ఒక మనిషి చంపించాడు నిజంగా కులం కోసం అయితే ఇప్పుడు ప్రణయాని వివాహం ఆడిన అ అమ్మాయి కులం ఏమిటి ? అనేది ప్రశ్న మరి అప్పుడు అ అమ్మాయిని కూడా ఆమె తండ్రి చంపించాలి కదా ఎందుకు చంపించలేదు ? అనేది ప్రశ్న, అతన్ని చంపిన తరువత కూడా నువ్వు ఇంత ఆనందముగా ఉంటావో లేదో చూద్దాము అని ఆమె తండ్రి పేస్ బుక్ లో ఆమె వీడియో లు చూసి ఎందుకు అన్నాడు అనేది? ప్రశ్న, ఇది ఒక తండ్రి తన కూతురు మీద కక్ష సాధించటానికి చేసిన పైశాచిక దుర్మార్గమా ? కాదా ? అనేది ప్రశ్న ?  చంపించిన వాడి పుట్టుక కూడా ఒక ప్రశ్నే ? శిధిలం అయిపోయిన  వ్యవస్థ లో ఒక ఆడకూతురు నడి రోడ్డు మీద తన ఐదవ తనాన్ని కోల్పోయిన రోజున  ఒక మనిషి ప్రాణానికి ఉన్న రక్షణ ప్రశ్నార్ధకమే? 








 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement