ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతమనేని రాజకీయ వ్యూహం మర్చవలిసిన అవసరం ఉందా ?



     



మాట కటువా ! మొండి వైకరి ! దూకుడు  ! చింతమనేని ప్రభాకర్ పశ్చిమగోదావరి జిల్లా లో ఈ పేరు తెలియనివారు ఉండరు. ఇతని వీడియోలు కొన్ని ఇప్పుడు పేస్ బుక్ లో హల్చల్ చేస్తున్నవి. అ వీడియో లు తీసింది వారి ప్రక్కన ఉన్నవారే అనే అర్ధం అవుతుంది. అ వీడియో తీసిన వ్యక్తీ యొక్క ముఖ్య ఉద్దేశం చింతమనేని మాటల ను చేష్టలను రికార్డు చెయ్యటం కాదు, చింతమనేని పార్టీ గుర్తు ని అవమానించాడు అనే విధముగా అ వీడియో చిత్రికరించటం. ఈ సమయం లో ఆలోచించవలిసినది విమర్శలు చేస్తున్న ప్రత్యర్ది పవన్ కళ్యాణ్ గురించి కాదు తన ప్రక్కనే ఉండి నమ్మక  ద్రోహం చేసే వారి గురించి.  ఎదురుగా వచ్చే శత్రువుని అయిన ఎదురుకోవచ్చు కానీ ప్రక్కనే ఉండి నమ్మక ద్రోహం చేసే వారిని ఎదురుకోవటం చాల కష్టం!  తేరుకునే లోపలే అన్ని చెయ్య జారిపోతాయి. ఇది ఒక చింతమనేని విషయం లోనే కాదు చాలామంది నాయకులు తెలుసుకోవలసిన విషయం. అ వీడియో సారాంశం ఎవరో ప్రజల వద్ద డబ్బు తీసుకున్నారు చింతమనేని వారిని తిడుతూ డబ్బులు వెన్నకి ఇచ్చేసి వారితో డబ్బు ముట్టింది అని చెప్పి రాయించుకొని రండి అని, కానీ వీడియో చిత్రీకరించే అతను చింతమనేని ప్రక్కనే ఉండి, అ సమయములో అతను ఆవేశం లో చేసే పొరపాటులను చిత్రీకరించే పని లో ఉన్నాడు. సొంత గూడులో వ్యతిరేకత ఉన్నప్పుడు, ప్రక్కన ఉన్నవారే ద్రోహం  చేసే  పరిస్థితులు ఉనప్పుడు ముందస్తు ప్రణాళిక ముఖ్యం.


ప్రస్తుతం పరిస్థితులు ఎలాగా ఉన్నాయి అంటే మాట్లాడే ప్రతి మాట అమూల్యం రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. విమర్శలు ఖండించటం లో తన శైలి లోని మార్పునే అధిష్టానం కోరుకుంటుంది అని వినికిడి, ప్రజ చర్చ కూడా.  పెద్దరికంగా విజయవాడ లో విమర్శలను  ఖండించిన  విధానం అందరిని ఆకట్టుకుంటుంది.

ఇంకా ఎన్నికలకి సమయం ఉంది, విమర్శకి ప్రతి విమర్శా చెయ్యనవసరం ఉందొ లేదో తెలియదు కానీ ప్రక్కనే ఉండేవారితో, మీడియా వారితో జాగ్రత్త గా వ్యవహరించావలిసిన పరిస్థితి ప్రస్తుత రాజకీయ వాతావరణం లో తప్పని పరిస్థితి. ఇంకా నేనింతే అనే ధోరణి ని ప్రత్యర్డులు అహంకారం క్రింద చిత్రీకరిస్తున్నరు అనే  విషయం మరవకూడదు. ఎవరి నియోజకవర్గం లో ఎవరు యెంత భాలముగా ఉన్న " ఖ్యతిగంచని నాయకుడు చరిత్రలో అలాగే మిగిలిపోతాడు " .  ప్రక్కన ఉన్నవారిని గమనిన్చుకోవలసిన పరిస్థితి ఉంది, ప్రజాస్వామ్యం లో చేసేది మంచి అయిన దూకుడుతనం పనికిరాదు. ప్రతి ఒక్కరు నియోజకవర్గం వచ్చి  ఎమ్యెల్య ఎలాంటివాడు అని అడగలేరు, తెలుసుకోలేరు మధ్యలో వారధి లాగా మీడియా పనిచేస్తుంది, అ మీడియా ముందల నోరు జరితే సమయానికి బ్రహ్మాస్త్రం , ఘటోత్ గజ  పరిస్థితి తప్పదు.

ప్రణాళిక మర్చవలిసిందే తప్పదు !       



 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement