ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

కార్పొరేట్ సెక్టార్ లో టీచర్స్ బాధలు



     
ఆదివారాలు సెలవలు ఉండవు, పండగలు పబ్బాలు ఉండవు, ఇచ్చేవి అరకొర జితలు , సీనియారిటీ కి తగినవిలువ, తక్కువ జీతానికి ఎక్కువ పని, నోరు విప్పితే ఉన్న ఉద్యోగం వదులుకొని ఏమి చెయ్యాలి అనే ప్రశ్న ? కుటుంబ పోషణ ఇతర ఇతర కారణాలు . మీరు కాకపోతే ఇంకొకరు అనే ధోరణి లో సంస్థలు. వీరికి అండగా నిలపడే వారు కావాలి. ఫీజ్ లు దండుకుంటున్న కార్పొరేట్ సంస్థలు ,  విద్య సంస్థలు బదులు కోళ్ళ ఫారం నడిపే కార్యక్రమం చేపడుతుంది. యువత క్రిడలకి దూరం. లంచానలికి కర్కుర్తి పడి కళ్ళు ముసుకుంటున్న పర్యవేక్షకులు. తరువాత తరం వారు కేవలం పని చేసే యంత్రలు లాగా మిగిలి పోయే ప్రమాదం గుర్తించిన అధ్యాపకులు వారి ఆవేదన సంస్థలకి తెలియచేయ్యలేక, కక్క లేక మింగలేక, రేపటి యువత యొక్క మానసిక ఆరోగ్య పరిణామాలు తలుచుకొని తమ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేస్తారు సామజిక స్పృహ ఉన్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా మనసు చంపుకొని ఈ ప్రజాస్వామ్యం లో వారికీ తప్పని పరిస్థితి.


ప్లే స్కూల్ లో డిజిటల్ క్లాసు రూమ్ : చిన్న పిల్లలకి ప్రాక్టికల్ గా చేసి చెప్పితే అర్ధం అవుతుంది, డిజిటల్ క్లాసు లు బుడతలకి అవసరమా, ఇంకా అక్కడ నుంచి వారి ఆలోచన శక్తి ని చంపేసి, బద్దకాన్ని వారి మనసు కి అలవాటు చేసే ప్రక్రియ లో ఎంత  వరుకు నిజమైన విధ్యబోధనలు ఉన్నాయి ? కొత్తగా వారికీ అనుకూలముగా  కోడి పిల్లలను తాయారు చేస్తున్నారు అంతే!

గేమ్స్ హౌర్ : ఎన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు  లు ఇప్పటి వరుకు ఎన్ని క్రీడ కార్యక్రమాలలో పాలుగున్నాయి ? చెప్పనవసరం లేదు

ఇంకా టీచర్స్ పరిస్థితి రాత్రి 10 - 11 వరుకు స్టడీ హౌర్స్ పేరుతో ఇటు విద్యార్దులను అటు టీచర్స్ ని నలిపేస్తూ ఆదివారం అంటే సెలవ, అసలు టీచర్ అనేవారికి ఒక కుటుంబం ఉంటుంది అనే ఆలోచన లేకుండా తక్కువ జీతం తో ఎక్కువ పని చేయించుకునే బానిస వ్యవస్థ ఎక్కడో వెతికి చూడనవసరం లేదు. ఒకరి అవసరం ఇంకొకరి లాభం. ఆర్ధిక పరిస్థితులు వారి గొంతు నోక్కేస్తున్నాయి, కుటుంబ బాధ్యతలు వారిని నోరు మెదపనివ్వటం లేదు, నిరుద్యోగ సమస్య వారిని కాలు భయటకు పెట్టనివ్వటం లేదు. ఇంకా సంస్థ ల లో పని చేసే సీనియర్ టీచర్స్ ఆవేదన  అంత ఇంత కాదు. సంస్థ ని నమ్మి వారి జీవిత కాలం అదే సంస్థ లో  గడిపిన వారికీ అరకొర జీతల సమస్య భయటకు చెప్పుకోలేకపోయిన, సన్నిహితుల దగ్గెర వెళ్లబుచ్చిన వారి ఆవేదన వర్ణతితం. ఇటు గుర్తింపు తక్కువయ్యి, అటు జితలు పెంచక సమస్యలలో ఉన్న కార్పొరేట్ సంస్థ లా ఉక్కు చేతి లో బందీలు గా ఉన్న విద్యార్ధులు, ఉపాధ్యాయుల పక్షాన నిలపడే నిజమైన శక్తి ఒకటి ఉంటె బాగుండును.  ఇక్కడ విద్యార్ధి ది, ఉపాధ్యాయుడిది ఒకటే పరిస్థితి ,  ఎందుకంటె వారు ఇరువురు   నోరు మెదపలేరు, ఒకరు తల్లి తండ్రులు ఇష్టానుసారం నడుచుకోవలిసిన పరిస్థితి, మరొకరు కుటుంబ బాధ్యత కోసం కష్టపడవలిసిన పరిస్థితి, ప్రతిఘటించాలనే పరిస్థితి ఒకరిది, ప్రతిఘటించగలిగిన ఏమి చెయ్యలేని పరిస్థితి ఇంకొకరిది .           








 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement