Skip to main content

తలనొప్పితో అధార్ - ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ - పటిష్టత లేని డేటా సెట్లు       ప్రతి దానికి ఆధార్ కార్డు తో లింక్ పెట్టిన ప్రభుత్వం ఆధార్ సేవలు అందించే ఆధార్ నమోదు కేంద్రాల పైన దృష్టి పెట్టడం లేదు. ఫోన్ నెంబర్ నమోదు చేయాలన్న , పేరు మార్పిడి చెయ్యాలి అన్న , తప్పులు ఒప్పులు ఎటువంటి కరెక్షన్స్ ఉన్న మూడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆధార్ నమోదు కేంద్రానికి అన్నం సద్దుకొని వెళ్లవలిసిన పరిస్థితి ఉంది. 


ఎక్కడైనా ఖాళీ ఉంటె చాలు అ రోజు దేవుడు ఆ మనిషిని కరుణించినట్టే.  ఒక రోజు పని మానుకొని పనికట్టుకొని ఏదో తప్పు చేస్తే శిక్ష అనుభవించిన వ్యక్తి లాగా , పీనుగులాగా ఆధార్ నమోదు కేంద్రం వద్ద ఆ రోజుకీ స్థిర నివాసం ఏర్పర్చుకోవలిసిందే. 

కొన్నిసార్లు సర్వర్లు పని చెయ్యవు, కొన్ని సారులు ఫింగర్ ప్రింట్ స్కానర్ పని చెయ్యదు, అన్ని పని చేసిన ఎంతో కొంత ఆలస్యం . 

కాంట్రాక్టు పద్దతే  ఈ  సమస్య కు ముఖ్య కారణం అని చెప్పాలి. ఎవరో ఒక్కరికి కాంట్రాక్టు కేటాయించటం వచ్చిన 5 రూపాయల కమిషన్ మాత్రమే మిగలటం తో కాంట్రాక్టు కి తీసుకున్నవారు బిక్కు బిక్కు మని వారే సిస్టం కొన్నుకొని , వారే సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్  చేసుకొని సర్వర్ లు పని చెయ్యకపోతే వారికీ ఉన్న అరా కోర అవగాహనా శక్తి తో తిప్పలు పడుతున్నారు అనేది వాస్తవం. 

అసలు ఎందుకు ఈ  ఆధార్? రేషన్ కార్డు ఉంది , ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంది వాటికే కంటి ని ఫింగర్ ప్రింట్ స్కాన్ ని అనుసంధానం చేస్తే సరిపోతుందిగా,  ఎవరి కడుపు నింపటానికి , సరే భద్రత దృష్ట్యా పెట్టారు అనుకుందాము ట్రాయ్ చైర్మన్ సైబర్ సెక్యూరిటీ లో దేశం ఏదో తోపు అన్నట్టు తన ఆధార్ నెంబర్ నెట్ లో పెట్టి సవాలు విసిరి సగం చిక్కారు - సైబర్ సెక్యూరిటీ విభాగం వారు  అయినా వివరాలు అన్ని భయట పెట్టారు. మన ఆధార్ డేటా సెట్ లు అంత సెక్యూర్డ్  గ లెవ్వు ఇది నమ్మిన నమ్మకపోయినా వాస్తవం . ఎందుకు ఉంటాయి మనం ఏ విద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం , ఏ విజ్ఞాన మేధస్సు ప్రోత్యహించటానికి డబ్బులు ఖర్చుపెడుతున్నాం . ఎవడు అయినా కోట్లు తగలేసి సొంత ప్రోగ్రామింగ్ డేటాబేస్ ని తయారుచేసుకుంటాడు  కానీ మన దరిద్రం మొన్నటివరకు ద్రుపల్ అనే వెబ్ ప్లాటుఫారం ని నమ్ముకొని మన ప్రభుత్వ వెబ్ సైట్ లు చాల వరుకు పని చేసాయి. ఇప్పుడు ద్రుపల్ అంటే శోధన వద్దు అది ఒక వెబ్ బ్లాగింగ్ ప్లాట్ ఫారం, వాడు పొందుపరిచినా ప్రోగ్రాం ని మనం అటు ఇటుగా మార్పులు ,  చేర్పులు చేసుకుంటున్నాము తప్ప మనకి మానముగా ఒక సొంత ప్లాటఫారం ఏర్పర్చుకోవటంలేదు . 

మన దేశ దౌర్భాగ్య వ్యవస్థ ఎలాగ ఉంది అంటే ఒక పి. హెచ్ .డి  చేసే కుర్రాడు ఒక ఫార్ములా  కనిపెట్టి అది సక్సెస్ అయ్యాక తన గురువు కి అంకితం చేద్దాము అని విషయం మొత్తం అతని గురువు కి చెప్పాడు - పీత రకం  "ముసలి " గుండె కావాలి అన్నట్టు - ఏముంది లే వదిలేయ్ పేటెంట్ రాదు అన్నాడు . ఇప్పుడు ఆస్ట్రేలియా వారు ఆ పేటెంట్ కొట్టేసారు , భారత దేశానికీ దొరకావాల్సిన పేటెంట్ ని మనం డబ్బులు ఇచ్చి ఆ ఫార్ములా కొన్నుకోవలిసిన పరిస్థితి . 

ఈ రకముగా మన దేశ మేధా శక్తి ని నీరుకారుస్తున్న,  సొంత గెడ్డ కొడుకులని కన్నా ఆ తల్లి ఎంత కష్టపడి కన్నదో !       

ఆధార్ ఒక కార్పొరేట్ ఒక రాజకీయ పార్టీ పగలు అనగా రాత్రి అనగా కష్టపడి పుట్టించిన  ఆలోచన! ఎలాగ ? ఆధార్ కంటి స్కాన్ , ఫింగర్ ప్రింట్ స్కాన్ (స్కాం కాదు స్కాన్ మీరు సరిగానే చదివారు )   కి సాఫ్ట్ వేర్ మరియు పరికరాలు కావాలి ! ఈ  పరికరాలు మన భారత దేశమే తయారు చేస్తుందా ?  ఎవరు తయారు చేస్తున్నారు ? ఏ కంపెనీ కి ఈ కాంట్రాక్టు వచ్చింది ?

సరే పోనే అంత కష్టపడి అన్ని వివరాలు సేకరించారు మరి ఆధార్ నెంబర్ అనుసంధానం అయినా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు ఎలాగ పోతున్నాయి.  అంటే ఆధార్ ని అనుసంధానం చేసి ఉన్న ప్రతి సాఫ్ట్ వేర్  డొల్ల అనేగా అర్ధం.

సైన్స్ పరిశోధన ఎట్లాగో ఏడవలేకపోతున్నాము కనీసం కంప్యూటర్ పరిశోధనలకు, టెస్టింగ్ టూల్స్ పరిశోధనకు అయినా కాస్త సమయం డబ్బు ప్రభుత్వం ఖర్చు పెడితే మంచిది .  మన మేధా శక్తి ఇప్పుడు పరాయి దేశం లో ఉంది ఎందుకంటే మనవాళ్ళు ఈ దేశం లో ఉన్న మేధాశక్తి ని ప్రోత్యహించే పరిస్థితి లో లేరు - భగవంతుడు చెప్పిన భాగవత గీత లో గీత సారంశం లో రాజకీయ ఎత్తుగేడలు వీరు తలకి ఎక్కించుకునట్టు అదే గీత లో ఉన్న విజ్ఞాన మేదస్సు గురించి తలకి ఎక్కించుకోలేదు - ఇది వాస్తవం.  ఇకనైన చెయ్యి చాచి ఓటు వెయ్యకుండా , కళ్ళు తెరిచి ఓటు వేస్తే ..... ? Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics