ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

అరెస్ట్ లు ఎన్ని, అరెస్ట్ ఏ ఏ సందర్బాలలో చెయ్యవచ్చు - అరెస్ట్ ఎన్ని రకాలు విశ్లేషణ



సెక్షన్ 41 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో మేజిస్ట్రేట్ వారెంట్ లేకుండా పోలీస్ ఆఫీసర్  ఎప్పుడు అరెస్ట్ చెయ్యవచ్చు అనే అంశం గురించి  క్లుప్తముగా వివరించపడింది.

1. ఎవరైన ఒక విచారణకు అరహమైన (Cognizable) లేదా ఎవరి పైన అయిన నేరం చేసినట్టు   సమంజసమైన ఫిర్యాదు  అందిన లేదా ఎవరైన నేరనికి పాలుపడతునట్టు  నమ్మకమైన సమాచారం అందిన లేదా పాలుపడినట్టు సమాచారం అందిన లేదా  నమ్మకమైన  అనుమానాస్పద వాతావరణం ఉన్న పోలీస్ వారు అరెస్ట్ చెయ్యవచ్చు.



2. ఎవరైన చట్ట వ్యతిరేకముగా ఒక ప్రదేశం లో ఉంటె, అక్కడ ఎందుకు ఉన్నారు అనే విషయం పైన సంజాయిషీ ఇచ్చే బాధ్యత అ వ్యక్తీ మీద ఉన్నప్పుడు .

3. ఎవరైతే రాష్ట్ర  ప్రభుత్వం వారు  ప్రకటించిన అపరాధి అయ్యి ఉంటారో వారిని

4. ఎవరి అధినంలో దొంగాలించాపడిన సొత్తు ఉంటుందో,  సొత్తు దొంగాలించాపడినది అనే నిర్ధారణకు వచ్చే విధముగా సందేహాలు కలిగించే వాతావరణం కలిగి ఉంటుందో,  ఎవరి మీద అయితే పైన తెలిపినటువంటి నేరాలు కు పాలుపడి ఉంటారు అనే సందేహం కలిగి ఉంటె

5. ఎవరైతే  విధులలో ఉన్న  పోలీస్ ఆఫీసర్ విధులకి ఆటంకం కలిగిస్తారో లేదా చట్టపరమైన ఆధీనములో (custody, కస్టడి ) లో నుంచి తప్పించుకుంటారో లేదా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తారో

6. ఎవరైతే భారత దేశం  భయట ఒక నేరం చేసి , లేదా భారత దేశం లో ఒక నేరం చేసి అది ఏ చట్ట ప్రకరమైన శిక్షించే నేరం అయిన , అటువంటి వ్యక్తీ తప్పించుకుంటున్న లేదా  కస్టడీ లోకి తిసుకోవలసివచ్చిన

7. ఎవరైతే ఒక నేరం చేసి శిక్షని అనుభవించి సెక్షన్ 365 రూల్ 5 లో ని అతిక్రమిస్తారో లేదా ఎవరినైన అరెస్ట్ చెయ్యాలి అని వేరొక పోలీస్ ఆఫీసర్ ఒక వ్యక్తీ ని అరెస్ట్ చెయ్యాలి అని అనుమతి  కోరతారో అ వ్యక్తీ ని వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యగలిగిన నేరనికి  పాలుపడితే

8. శాంతి భద్రతల దృష్ట్యా  (సెక్షన్ 109 మరియు 110 ) మరియు అనుచిత నేరస్తులు నుంచి భద్రత కొరకు అరెస్ట్ చెయ్యవచ్చు .

సెక్షన్ 42 :  పోలీస్ ఆఫీసర్ ఎదుట  ఎటువంటి నేరనికి అయిన  పాలుపడినప్పుడు, అ వ్యక్తీ  చెప్పిన   పేరు, చిరునామా తప్పు అని పోలీస్ ఆఫీసర్ భావిస్తే అప్పుడు అ వ్యక్తీని పోలీస్ వారు అరెస్ట్ చెయ్యవచ్చు.  ఎప్పుడైతే అ వ్యక్తీ సరైన సమాచారం  పొందుపరుస్తాడో అప్పుడు అతని సొంత  జామీను మీద అతన్ని రిలీజ్ చెయ్యవచ్చు.  లేకపోతే రిమాండ్ కి తరలించాలి.

సెక్షన్ 43 :  ప్రైవేట్ వ్యక్తులు అరెస్ట్ చెయ్యవచ్చు :  పోలీస్ ఆఫీసర్ కాకుండా భయట వ్యక్తులు కూడా అరెస్ట్ చెయ్యవచ్చు ఇందుకు కొన్ని పరిమితులు ఉంటాయి.  ఎవరైన ఏ వ్యక్తీ ఎదుట ఒక నేరం చేసి ఉంటె అతన్ని ఆధినములోకి తీసుకోని ఆలస్యం చెయ్యకుండా దగ్గేరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి.

సెక్షన్ 44 : మేజిస్ట్రేట్ అరెస్ట్ చెయ్యవచ్చు లేదా ఆదేశించవచ్చు : ఒక మేజిస్ట్రేట్ లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ఎవరైన వ్యక్తీ నేరనికి పాలుపడితే అతన్ని స్వయముగా అ ప్రదేశం  మేజిస్ట్రేట్ లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పరిధి లోకి వస్తే  అ వ్యక్తీ ని అరెస్ట్ చెయ్యవచ్చు లేదా అ పరిసరాలలో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చెయ్యమని ఆదేశించవచ్చు, అవసరం అయితే అరెస్ట్ చెయ్యమని వారెంట్ జారి చెయ్యవచ్చు.

  తరువాత ఆర్టికల్ లో అరెస్ట్ చేసే ముందల పాటించవలిసిన నియమాలు - సెక్షన్ 41-A గురించి తెలుసుకుందాము. 
     
  

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement