ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఎవరు సింహాసనం ఎక్కిన పాకిస్తాన్ లో పాలన వారు చెప్పినట్టే జరుగుతుంది -ఇమ్రాన్ ఖాన్ భరత్ ప్రధానికి ఆహ్వానం పంపిస్తారా?



     
క్విక్ ఆంధ్ర : ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని పగ్గాలు చేజిక్కుంచుకోవటానికి సిద్దం గా ఉన్న వ్యక్తీ.  ప్రపంచం అంత కోడి అయ్యి  కూసే వార్త ఇమ్రాన్ ఖాన్ సింహాసనం ఎక్కిన అతను సైన్యం చేతిలో కీలు బొమ్మ అని. ప్రస్తుతం సైన్యం కనుసైగలలో  పని చేసే ఒక వ్యక్తీ  పాకిస్తాన్ సైన్యానికి కి కావాలి. అ లక్షణాలు ఇమ్రాన్ ఖాన్ వద్ద పుష్కలముగా ఉన్నాయి కాబట్టే ఇమ్రాన్ ఖాన్ కి ప్రధాని పదవి కట్టబెట్టే విషయంలో ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చెయ్యలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.


జనరల్ జియా ఉల్ హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ వీరిద్దరు నియంతులులగా పాలించి పాకిస్తాన్ ప్రజల మెప్పు కి దూరమయ్యారు.  ఇప్పుడు ఇమ్రాన్ ఎలాగా పాలన చేస్తారు అనే విషయం పైన ప్రపంచం అంత చర్చ నడుస్తుంది. ఇటు ప్రజలను మెప్పించాలి, అటు సైన్యాన్ని మెప్పించాలి. జోడెద్దుల మీద కాలు బెసకకుండా సవారీ చెయ్యాలి.

యుద్ద వాతావరణం  : ఒక వేళా ఉగ్రవాద చర్యలు ముదిరితే , పాక్ భూభాగం నుంచి ఉగ్రవాదులు భరత్ మీద దాడులు కి పలుపడితే , వారి స్థావరాల మీద దాడులకు భరత్ ఎటు సిద్దంగా ఉంది. ఒక వేళా చర్యలు శ్రుతిమించితే  యుద్ధం తప్పని పరిస్థితి  అయ్యే ప్రమాదం ఉంది.

కాశ్మీర్ లో సొంత ఇస్లామిక్ రాజ్యం కోరుకుంటున్న ప్రజలు. భరత్ ఒక ముందు అడుగు వేస్తే తను రెండు అడుగులు శాంతి కొరకు ముందుంటాను అని ఒక సభ లో చెప్పారు ఇమ్రాన్ ఖాన్. బహుశా ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు వారికీ ఎవరి ప్రమేయం లేని సొంత ఇస్లామిక్ రాజ్యం కావాలి అనుకుంటున్నారు అని అనుకుంటున్నా సందేశం వారి వరుకు చేరి ఉండదు అనేది విమర్శకుల వాదన.

ప్రధాని మోది ని ఇమ్రాన్ ఖాన్ తన ప్రమాణ స్వికారణకి ఆహ్వానిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇరు దేశాల మధ్య సత్యసంబంధాలు ఏర్పడటానికి కృషి చెయ్యాలి అని మోది తెలియచేసినట్టు   ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రెస్ మీట్ లో తెలియచేసారు.

ఏది ఏమైనా ప్రపంచం మొత్తం ఇమ్రాన్ ఖాన్ గురించి ఒక్కసారిగా మాట్లాడుకుంటుంది.  అయన పాలన ఎలాగా ఉంటుంది అనే విషయం ప్రజల ఎవరి ఉహగానలలో వారు ఉన్నారు . జరిగేది ఏమిటో వేచి చూడాలి.






 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement