Skip to main content

చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ కలిస్తే నే ప్రత్యేక హోదా సాధ్యం ....    

   
ప్రత్యేక హోదా ప్రస్తుత రాజకీయ  పరిస్థితుల  ప్రకారం సాధ్యం కాదు, బందులు చేసిన, రాస్తరోకలు చేసిన , గొంతు చించుకొని కొండనాలిక కనపడేలగా అరిచి మొత్తుకున్నా ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా అసాధ్యం.

ప్రత్యక హోదా నినాదం రాష్ట్రం లో మొదట చేసింది కమ్యూనిస్ట్ పార్టీ వారు. అ తరువాత ఒకరి తరువాత ఒకరు ఒకరి తరువాత ఒకరు ఇప్పుడు అందరు అదే నినాదం.  హక్కు,  పోరాటం క్రింద పరిగణించవలసిన హక్కు కాస్త ఇప్పుడు రాజకీయ చదరంగం లో ఒక భాగం క్రింద మారిపోయింది.


ప్రత్యేక హోదా ఇప్పటి రాజకీయ పరిస్థితుల లో సాధ్యమా ? మోది వచ్చి చెప్పనవసరం లేదు ? కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మనకే అర్ధం అవ్వుతుంది.  కాంగ్రెస్ కి వై.యస్.అర్ పార్టీ కి ఉన్న వైరం అందరికి తెలిసిందే. ఒక వేళా రాష్ట్రం లో    వై.యస్.అర్ పార్టీ పదవిలోకి వచ్చి కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ పదవిలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తార ? ఇవ్వరు, ఎందుకు అంటే ఇక్కడ వై.యస్.అర్ కాంగ్రెస్ పదవి లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో   తన ఉనికి కోల్పోతాది. ఇప్పుడు చెప్పండి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లో ఉంటె రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా?

సరే వై.యస్.అర్ కాంగ్రెస్  పార్టీ పదవిలోకి వచ్చి కేంద్రం  బిజెపి చేచిక్కించుకుంది అని అనుకుందాం ! బి జే పి ఏమాత్రం అదురు బెదురు లేకుండా  నిస్సంకోచముగా తేల్చి చెప్పేసింది ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు అని.

తెలుగుదేశం పార్టీ పదవిలోకి వచ్చి కేంద్రాన్ని కాంగ్రెస్ చేచిక్కించుకుంటే, తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ది  అయినటువంటి తెలుగు దేశం పార్టీ హయం లో ప్రత్యేక హోదా ఇచ్చే  సూచనలు ఉన్నాయా!  విశ్లేషుకుల విశ్లేషణ ప్రకారం ఎటువంటి అవకాశం లేదు.

సరే తెలుగు దేశం  పార్టీ పదవిలోకి వచ్చి కేంద్రం  బిజెపి చేచిక్కించుకుంది అని అనుకుందాం ! బి జే పి ఏమాత్రం అదురు బెదురూ లేకుండా  నిస్సంకోచముగా తేల్చి  చెప్పింది ఇవ్వటం అనేది జరగదు అని.

అర్ధం కావలిసిన విషయం ఏమిటి అంటే ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతం రాజకీయ సెంటిమెంట్ గా మారుతున్న ఒక సువర్ణ ఆయుధం - ఎన్నికల వేడికి అవసరమైన ఇంధనం. అసలు ఏ స్వార్ధం లేకుండా నినాదం చేసింది ఒకరు, కానీ అ నినాదాన్ని ఇంధనం గా మర్చి  అ ఇంధనం తో చలి మంట రగిలించి చలి కాచుకుందాం అని చూసే వారు ఎందరో .  

నిజంగా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర నాయకులు చిత్తశుద్ది తో రాష్ట్రం బాగుపడాలి అనే ఉద్దేశం తో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్నట్టు అయితే  చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్    ప్రత్యేక హోదా ఆమోదించినవారికే తదుపరి ఎన్నికలలో,  కేంద్రం లో మా మద్దతు ప్రకటిస్తాము అని చెప్పి తీరాలి ! వారు ఎవరైన సరే  పార్టీ ల తో సంబంధం  లేకుండా అందరు ఒక కట్టు మీద ఉంటె అప్పుడు ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధ్యం, ఐకమత్యమే ప్రత్యేక హోదా సాధనకు వజ్రాయుధం.


ప్రత్యేక హోదా సాధనకు తమిళనాడు జల్లికట్టు, అస్సాం (బోడోలాండ్) తరహ ప్రజా ఉద్యమాలు చెయ్యాలి  లేదా అన్ని రాజకీయ పార్టీలు  ఎలక్షన్ బాయ్ కాట్  చెయ్యాలి లేదా కేంద్రం లో ప్రత్యేక హోదా ఇస్తాము అని వాగ్దానం చేసినవారికి కేంద్ర ప్రభుత్వం ఎర్పటుచేయ్యడానికి మద్దతు ప్రకటించాలి, ఐకమత్యం తోనే ప్రత్యేక హోదా సాధ్యం- ప్రస్తుతం రాజకీయ పరిణామాలు దృష్ట్యా ఐకమత్యమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించపెట్టగలదు , పోరాటం లో చిత్తశుద్ది ఉండాలి - మామిళ్ళపల్లి వసంత రావు గారు -  పశ్చిమగోదావరి జిల్లా సభ్యుడు కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా- .


సమిష్టి కృషితో ప్రత్యేక హోదా ఖచ్చితంగా  సాధ్యం ప్రత్యేక హోదా
సాధనకు అందరు సహకరించాలి- ఇప్పటికి పార్టీ అధినేత ఉద్యమాన్ని ముమ్మరం చేసారు అందరు ఉద్యమానికి సహకరిస్తే ప్రత్యేక హోదా సాధ్యపడుతుంది   నరుకుళ్ళ  గోపాలకృష్ణ - టి.డి.పి. సభ్యుడు - 
ప్రత్యేక హోదా సాధనకు పార్టీ కట్టుపడి ఉన్నది - రాజకీయ ప్రయోజనలకంటే రాష్ట్ర అభివృద్దే పార్టీ కి ముఖ్యం -  ప్రత్యేక హోదా ఇవ్వటం వలన రాష్ట్ర విద్యార్దులకి మంచి భవిష్యత్తు ఉంటుంది - ప్రత్యేక హోదా కోసం ఎటువంటి పోరాటానికి అయిన  సిద్దం - మిర్యాల దిలీప్  వై.యస్ .అర్ కాంగ్రెస్ విద్యార్ది విభాగం అధ్యక్షుడు, చింతలపూడి మండలం

రాష్ట్రం ఇప్పుడు ఉన్న పరిస్థితులకి  రాజకీయ  ఐకమత్యం ఒక్కటే ప్రత్యేక హోదా సాధించగలదు -ప్రదీప్ కుమార్ - ఎన్ .అర్.ఐ  - ప్రోగ్రెసివ్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ సభ్యుడు  
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics