ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆత్మ విశ్వాసం - మానసిక స్థితి - గెలుపు



       


వెయ్య ఎడ్లని ఒక మనిషి అదుపు  చెయ్యగలడు. ఎంతటి బలవంతుడిని అయిన తన అదుపాజ్ఞలలో ఉంచుకోగల శక్తి మనిషి కి మాత్రమే ఉన్న, అది ఒక అద్భుతమైన శక్తి -వరం. అయితే మానసిక వైకల్యం కూడా శారిరిక వైకల్యం తో సమానం. దుర్దుష్టవశాత్తు, కొంత మంది మానసిక సమస్యలు సృష్టించుకొని తమను తము తక్కువుగా అంచనా వేసుకుంటారు. తమ లోపాలను నేమరవేసుకుంటూ వాటి తో సహజీవనం చేస్తారు


ప్రధమంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లోపం లేని మనిషి లేడు, సమస్య లేని జీవి లేదు. కానీ తము చేసే పని లో అత్యున్నత స్థాయి కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒక నియమాన్ని ఖచ్చితంగా పాటించారు అనే చెప్పవచ్చు. అ నియమం పేరు  ఆత్మ విశ్వాసం.

 సాధించాలి అని అనుకున్న దాన్ని సాధించాలి! అది ఎదుటవారికి  సాధ్య పడనది కావచ్చు, ఇంత వరుకు ఎవరు ప్రయత్నం చెయ్యంది కావచ్చు. చాల మంది కి తెలియని విషయం ఏమిటి అంటే ఆశక్తి కి , విద్యకి , సాధించటానికి ఎటువంటి సంభందం లేదు. ఎవరి లో ఏ ప్రతిభ ఉన్నదో ఎవరికి తెలియదు, కన్నా తల్లి తండ్రులకి కూడా. 

ఒక్క పరాజయం మనిషి మానసిక స్థితి పైన ఎంతో ప్రభావం చూపిస్తుంది, అదే రెండు మూడు ఎదురు అయితే అ సమయములోనే ఆత్మ విశ్వాసం తో కలిగి ఉండాలి ప్రపంచం లో యెంత మంది మిమ్మలిని నమ్మిన నమ్మకపోయినా తుది శ్వాస విడి పోయే వరుకు మిమ్మల్లని మీరు నమ్మాలి. తల్లి తండ్రులు నమ్మలేదు వదిలేయ్ , స్నేహితుడు నమ్మలేదు వదిలేయ్ , భార్య నమ్మలేదు వదిలేయ్, సన్నిహితులు నమ్మలేదు వదిలేయ్ వారి నమ్మకం కోసం ప్రయత్నం చెయ్యవద్దు ! వారు చెప్పే విషయాలు, నీ మీద నీకు ఉన్న నమ్మకాన్ని కొలిపోయే విధముగా ఉంటె వాటిని వినవద్దు, వారి వద్ద ని లక్ష్యం గురించి ప్రస్థావన తీసుకోని రావద్దు. ఎందుకంటె నువ్వు చెయ్యాలి అనుకున్నది అసాధ్యం కావచ్చు కానీ ఎప్పుడు అయితే నువ్వు దాన్ని సుసాధ్యం చేసి చుపిస్తావో అప్పుడు వారు ఏమి అంటారో తెలుసా " మా వాడె మకేప్పోడో తెలుసు వాడు సాధిస్తాడు అని " -  


ని వాళ్ళ కాదు అనే వాడికి సాధ్యమైనంత దూరంగా .......

ని వాళ్ళ అ పని కాదు అనే వాడు ఐతే మిమ్మల్ని తన అదుపాజ్ఞలలో ఉంచుకోవాలి అని అనుకునే వాడు అయిన అయి  ఉంటాడు , లేక పోతే జీవితం లో ఏదో ఒకటి సాధించాలి అనే ప్రక్రియ లో   ఒకే ఒక ప్రయత్నం చేసి ఓడి మళ్ళి ప్రయత్నం చెయ్యని  పిరికివాడు అయిన అయ్యి ఉండాలి.

ఇటువంటి వారికీ దూరంగా ఉండాలి  ...... ఇటువంటి వాళ్ళు సాధించాలి అని తపన ఉన్నవారికి అక్కరలేని చెత్త తో సమానం. 

ఓపిక .....ఓపిక : ప్రయత్నం చేసినతరువాత మొదట బెడిసికొడితే ప్రయత్నం విరమించుకోవాలనే  ఆలోచన ని మనసులోకి రానివ్వుకుండా, ఒక వేళా వచ్చిన నేను చెయ్యగలను ప్రయత్నం చేస్తాను అని ధృడముగా సంకల్పించుకుంటే ఏదో ఒక్క రోజు ఖచ్చితంగా సాధించటం ఖాయం.

సాధించుకోవలసిన విషయాలలో నిర్ణయాలు కీలకం  

ఎదురు ఈత చెయ్యవచ్చు కానీ ప్రవాహ దాటిని తట్టుకోగలమా లేదా అది సాధ్యమా కాదా! అనే ఆలోచన కూడా చెయ్యాలి. పొటేలు వెళ్ళి కొండని డి కొట్టటం గురించి ఎప్పుడు గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఉంది.

ఏది ఏమైనా మన చుట్టూ ప్రక్కన ఉన్న వారి అభిప్రాయాలు మన మానసిక స్థితి మీద ప్రభావం చుపించకుడదు.  ఆత్మ విశ్వాసం కొలిపోవటం అంటే మిగిలిన జీవితం అంధకారం లో గడపటమే. 

....కొనసాగుతుంది 









 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement