ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

బెట్టింగ్ రాయుళ్ళ బెండ్ తీస్తున్న చింతలపూడి పోలీసులు - గేమింగ్ యాక్ట్ తో పాటు సెక్షన్ 420 కూడ బోనస్




పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గ్రామం లో పోలీస్ వారు బెట్టింగ్ కి పాలుపడేవారి మీద ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారు. సాధారణముగా ఇటువంటి నేరాలు సమాజం మీద చాల దుషప్రభావం చూపిస్తాయి,  పోలీస్ వారు ఈ విషయాన్ని చాల సీరియస్ గా తీసుకున్నారు. అరెస్ట్ చేసినవెంటనే బెయిల్ అనే సుప్రీమ్ కోర్ట్ వారి మార్గదర్శకాలు కు కొంత మంది బెట్టింగ్ రాయుళ్ళు లెక్క లేని విధముగా వ్యవహరించటం, ఎపి గేమింగ్ యాక్ట్  క్రింద శిక్ష కాలం 7 సంవత్యరాల లోపు, ఈ విషయాన్ని అదునుగా తీసుకోని   సమాజం లో బెట్టింగ్ లకి పలుపడేవారు మరి శ్రుతి మించిపోతున్నారు.


అదుపు చెయ్యకపోతే యువత తప్పు దోవ పట్టే ఆవకాశలు ఎక్కువ. మధ్యతరగతి కుటుంబాలు చిన్నబిన్నం అయ్యే ఆవకాశాలు ఎక్కువ అందుకని ఇటువంటి నేరాలకు పలుపడే వారివద్దనుంచి వారు బెట్టింగ్ చెయ్యటానికి ఎదుటవారిని ఎలాగా ప్రేరేపిస్తున్నారు  అనే అంశం పైన , అలాగే వారు బెట్టింగ్ అని చెప్పి ఎంత మందిని మోసం చేసారో అనే లిఖిత పూర్వక  వంగ్ములన వారి వద్ద తీసుకోని, సెక్షన్ 420 ని కూడా ఎఫ్ .ఐ .అర్ లో జతపరిచి రిమాండ్ కి తరలిస్తున్నారు.

ఇలాగ చెయ్యటం వలన బెట్టింగ్ లు నిర్వహించాలి అని ప్రేరణ పొందే వారికి ఇటువంటి సంఘటనలు ఒక రిమైండర్ లాగా పనిచేసి బెట్టింగ్ వ్యవహారాలు తగ్గే ఆవకాశలు ఎక్కువ. ఎందుకంటె ఈ బెట్టింగ్ రొచ్చు లో బలి పశువులు మధ్య తరగతి వారు, యువకులు.  బెట్టింగులకి పలుపడే వారికీ ఇది ఒక బహిర్గత వార్నింగ్ క్రింద పరిగణించవచ్చు.




 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement