Skip to main content

గుంటూరు లో సామాన్యుడి కి జరిగిన అన్యాయం లో న్యాయ పోరాటం చేసే విధానం ....!     గుంటూరు లో పోలీస్ వారు సామన్యుడు అడిగిన ప్రశ్న కు సమాధానం చెప్పలేక అతని మీద తమకున్న సర్వ శక్తులు వాడి కేసుల లో ఇరికించడం అనేది ప్రచారం లో ఉన్న విషయం. అయితే ఈ విషయం పైన  సోషల్ మీడియా లో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఒక వేళా అ వీడియో బాధితుడి కి సంబందించిన వీడియో అయితే అతను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకోని హై కోర్ట్ కి  క్వాష్ కి వెళ్ళటం మంచిది. ఎందుకు అంటే పోలీస్ వారికీ తాళాలు లాక్కునే హక్కు లేదు, బండిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం కి కానిస్టేబుల్ మర్చి  పెట్టి వీడియో తియ్యటం గమనించవచ్చు. బాధితుడి సంభాషణ చూస్తే అక్కడ సిసి ఫూటేజ్ అందుబాటులో ఉంది. సదరు కానిస్టేబుల్ గారు వేరే వారు మాట్లాడనప్పుడు నీకెందుకు అనే అర్ధం వచ్చే లాగా మాట్లాడటం మనం గమనించవచ్చు. 


అతని సంభాషణ కేవలం ఇక్కడ నో పార్కింగ్ బోర్డు లేదు మరి బోర్డు లేనప్పుడు ఎవరికి తెలుస్తుంది ఇక్కడ పార్కింగ్ చెయ్యకూడదు , ఎందుకు వాహనాలు తరలిస్తున్నారు అనే ప్రశ్న. 

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో. సామాన్యముగా ఇటువంటి చర్యలు ఖాకి చొక్కా వేసుకోకుండా చేస్తే దాదాగిరి అంటారు, రౌడి మాములు కోసం వేసే వేషాలు అంటారు. రోడ్ మీద వెళ్ళే పోరంబోకులు రౌడి లు చట్ట వ్యతిరేక కార్యకలాపాల కి పాలుపడితే ప్రశ్నించిన వారి మీద తిరగపడి దౌర్జన్యానికి దిగుతారు.

కానీ ఇక్కడ ఖాకి చొక్కాలు వేసుకొని ఉన్నారు కాబట్టి  చట్టపరముగా తమకున్న వేసులబాటు తో సామాన్యుడు గొంతు లేగిస్తే వారి గొంతు ని నోక్కేస్తము అనే విధముగా  సమాజానికి సందేశం పంపించిన ఈ చర్య ఒక్క ప్రభుత్వ జోక్యం తోనే సద్దుమనుగుతుంది. అయితే జరిగిన విషయం పైన పూర్తి అరా తియ్యకుండా "దౌర్జన్యానికి దిగిన యువకుడి పైన కేసు నమోదు " అని హెడ్డింగ్ లు పెట్టి మరి బాధితుడి వద్ద ఉన్న సాక్ష్యాలని వెలుగులోకి రానివ్వకుండా కొంత మంది సోదరులతో ఉన్న  స్నేహపూరిత సంబంధాలు ప్రజలకి అర్ధం అయ్యే లాగా బాగానే సెలవిచ్చారు.

జరిగిన అన్యాయం తన సోషల్ నెట్వర్కింగ్ ఎకౌంటు లో పోస్ట్ చేసుకుంటాను అంటే తప్పా?  క్రింద స్థాయి ఉద్యోగులను పర్యేవిక్షించవలసిన పైన స్థాయి ఆఫీసర్ తనకున్న ప్రతి పవర్ ని వాడేసి బాధితుడిని ముద్దాయి క్రింద బాగానే చిత్రీకరించారు అని కొంత మంది భావ వ్యక్తీకరణ  చేస్తున్నారు.

సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వలన వీడియో భయటకు వచ్చింది, జరిగిన విషయం ప్రతి సామాన్యుడికి అర్ధం అవ్వుతుంది. ఈ వీడియో షేర్ చెయ్యడం వలన అయిన అ అభాగ్యుడి కి న్యాయం జరుగుతుంది అనే హెడ్డింగ్ తో వీడియో - ప్రక్కనే ఉన్న వార్త క్లిప్పింగ్స్ ఫేస్ బుక్ లో వైరల్ గా మారిపోయాయి, వాట్స్ యప్ లో అయితే ప్రతి గ్రూప్ లో ఇదే డిస్కషన్. 

ఇటువంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వయిరీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (సబ్ ఇన్స్పెక్టర్ ) చెయ్యాలి, అప్పటికి అ వీడియో ఫుటేజ్ చూస్తే అసలు జరిగింది ఏమిటి అనేది అర్ధమవుతుంది.  

పోలీస్ వారు ఈ అత్యుత్యాహం పశ్చిమ గోదావరి జిల్లా లో  జరిగిన మర్డర్ కేసు లో చూపించి ఉంటె కేసు సి బి ఐ వరుకు వెళ్ళి మళ్ళి అది మర్డర్ అని నిర్దారించి రాష్ట్రం లో రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నారు  అనే  పేరు ఉండేది కాదు. 

నెట్ జెన్స్ ఈ వీడియో ని చూసి  అధికార హుంకారం మీద వ్యతిరేకత  వ్యక్తం చేస్తున్నారు. అనాగరిక కాలం లో రాజభటులు చేసిన వీరంగం లాగా ఉంది ఈ వ్యవహారం. తప్పో ఒప్పో ముందల కేసు అనేది పెడితే కోర్టు చుట్టూ తిరిగేసరికి జీవిత కాలం గడిచిపోతుంది అని కేసు లు పెట్టడం దేశం లో ఒక ఆనవాయితీగా  మారిపోయింది.  టెక్నాలజీ పెరిగింది ఏ వార్త దాగదు అనే విషయం ఇప్పటికి అయిన కొంత మంది మిత్రులు గ్రహించాలి. అధికారుల మెప్పు కోసం మోచేతి నిల్లు త్రాగటం మానకపోతే సంస్థలకి వచ్చే చెడ్డ పేరు అంత ఇంత కాదు. అతను అడిగిన ప్రశ్నకి నో పార్కింగ్ బోర్డు అక్కడ ఉందో లేదో చూపిస్తే సరిపోతుంది - కేసులు పెట్టి వేధించనవసరం లేదు. అదే కే.టి.అర్ (తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న సమయం లో) ఒకప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని నోటి కి అడ్డు అదుపు లేకుండా తిట్టినప్పుడు పెట్ట లేని కేసులు ఇప్పుడు ఒక సామాన్యుడు నో పార్కింగ్ బోర్డు గురించి ప్రశ్నిస్తే , ప్రశ్నించిన గొంతు నొక్కే ప్రయత్నం చేసే వారి ది ఖచ్చితంగా ఖాకిఇజం అనే  పెరుకోనవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.    

 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics