ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యురాలు పీతల సుజాత మీద అసభ్య పదజాలం ఖండించావలిసిన విషయం




భారత దేశం లో మహిళలకు ఉన్న విలువ, గుర్తింపు వేరు.  రాజకీయం గా సిద్దాంత పరముగా వ్యతిరేకత ఉండవచ్చు కానీ, వ్యక్తిగత కక్షలు, వర్గపోరు కి పోయి విమర్శించేటప్పుడు మనం ఒక మహిళా  వ్యక్తిత్వాన్ని సైతం విమర్శించే స్థాయికి దిగాజరకుడదు. 


పది మంది ముందల ఒక మహిళా మీద అసభ్యపదజాలలు వదిలితే ఒరిగేది ఏమున్నది ? నిన్న మీ ముందల ఆమెను విమర్శించిన నాయకులు రేపు అవకాశం దొరికితే ఆమె ముందల ఏ విధముగా నటిస్తారు అనే విషయం అందరు ఆలోచించవలిసిన విషయం.

సరే రాజకీయాలు కాసేపు ప్రక్కన పెట్టి మానవత దృష్తి తో ఆలోచిస్తే , ఆమె ఒక మహిళా , అంటే అసభ్య పదజాలం వదిలిన వ్యక్తీ ఇంటిలో ఉన్న ఒక తల్లి, ఒక చెల్లి లాంటి మహిళే ఆమె. ఆమె గురించి అంత అసభ్యముగా సామజిక మాధ్యమాలలో పది మంది చూసే చోట అటువంటి పదజలముతో దూషించటం ఖచ్చితంగా కట్టడి చెయ్యవలసిన విషయమే.

రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతముగా  దాడి చెయ్యటముకంటే వారు చేసినది సాక్ష్యాలతో సహా భయటకు తియ్యటం భాద్యత గల ఒక పౌరిడి లక్షణం. అటువంటి పనులు సాక్ష్యాలతో పది మందికి తెలిసేలగా చెయ్యటం వళ్ళ సామాజిక స్పృహ కలిగించవచ్చు. అంతే కానీ అసభ్య పదజాలం వాడటం అనేది ఉన్మాద చర్య క్రింద పరిగణించవచ్చు. 

ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యురాలిగా కాకముందల ఆమె అక్షరాలు దిద్దించే ఒక ఉపాధ్యాయురాలు, ఒక వ్యక్తీ గురించి ఒక అభిప్రయం వ్యక్త పరిచేటప్పుడ్ వారి గురించి మనకి ఎంతవరుకు తెలుసు అనే దాని గురించి ఆలోచించాలి.  చింతలపూడి నియోజకవర్గం లో గ్రూప్ రాజకీయాలు గురించి అందరికి తెలిసిందే, కానీ అ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అనే విషయం ఎవరికి తెలియదు. 

చాల మంది తెలుసుకోవలిసింది ఏమిటి అంటే అ వ్యక్తీ స్వతహాగా అ కామెంట్ పెట్టడ? లేదా స్థానికముగా రాజకీయ నాయకులు మాట్లాడుకునే మాటలు విని    అ పని చేసాడ అనేది ఇక్కడ ప్రస్థావన లో ఉండవలిసిన విషయం.  ఎందుకు అంటే మన చుట్టూ ప్రక్కన పరిసరాలు మన మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. 

గ్రూప్ రాజకీయాలలో చాలామంది ఈ విషయం అంతగా పట్టించుకోకపోవచ్చు కానీ అందరు ఒక గూడు క్రిందనే ఉన్నారు అనే విషయం మరిచిపోకూడదు. నేటి ఈ అసభ్యకరమైన కామెంట్ వెనుక యెంత మంది నాయకుల నేలుకలు చిలుకలు అయ్యే వరుకు  వ్యర్ధ మాటలు ప్రభావం ఉందో అలోచిన్చుకోవలిసిన పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా ఆమె ఒక మహిళా అనే విషయం మరిచి ఆమె పైన అసభ్య పదజాలం వదిలిన వారి పైన చట్టం తన పని తను చేస్తుంది .   సామాజికి మాధ్యమాలకి కూడా ఒక హద్దు పరిమితి ఉంటుంది - ఒక మహిళా అందులోనూ శాసనసభ్యురాలి గా, ఒంటరిగా తన పోరాటం తను చేస్తూ  వేరొక మహిళలకు ఆదర్శముగా పోరాటం చేస్తున్న ఆమె పైన అసభ్య పదజాలం వాడి, వేరొకరి మాటలలో వాస్తవం ఉన్నదా లేదా  అని తెలుసుకోకుండా అవివేకముగా విచాక్షనరహితముగా అసభ్యపదజలముతో విమర్శలకు పాలుపడిన అతని మానసిక స్థితి కోలుకోవాలి అని ఆశించటం తప్ప చేసేది ఇంకేమి లేదు.   

నిజం చెప్పాలి అంటే ఆమె ప్రస్తుతం ఒంటరిగా తన పోరాటాన్ని తనే నడిపించుకుంటూ వస్తుంది.  విమర్శలు ఒక్కసారి ప్రక్కన పెడితే ఆమె గెలిచిన నాటి నుంచి ఆమె పోరాట పటిమను ఒక్కసారి గమనిస్తే ఎక్కడ తలవంచకుండా  ఆమె రాజకీయ వ్యూహాన్ని ప్రత్యర్దుల వ్యుహలకి అంతుచిక్కని విధముగా రచించిది అంతే గాని ఎవరికి తలవగ్గలేదు, ఎత్తు వెయ్యండి దానికి  పై ఎత్తు తో నేను సిద్దముగా ఉన్నాను అనే విధముగా వ్యవహరించింది తప్ప ఎప్పుడు వెనకడుగు వెయ్యలేదు. ప్రత్యర్ది పార్టీ లో  కిలకముగా ఉన్న వారిని తన పార్టీ లో కి అనుమతించారు - ఇదే కే సి అర్  చేస్తే ఆపరేషన్ "ఆకర్ష " అన్నారు. 

ఒక  మహిళా నాయకురాలు అన్ని వ్యతిరేక పవణాలను ఎదురుకొని నిలబడటం, సమర్దవంతముగా ఎదురుకొని వ్యూహానికి ప్రతివ్యుహం రచించడం రాజకీయాల మీద ఆమెకున్న పట్టు సమర్ధత గురించి తెలుసుకోవచ్చు.  ఆమెను పొగిడే పని మేము పెట్టుకోలేదు కేవలం ఆమె గురించి చాల మంది ఆలోచించలేని , చూడలేని ఒక కోణం గురించి చెప్పుతున్నాము. 

రేపటి తరం లో  రాజకీయ ప్రవేశం చెయ్యలి అనుకునే  మహిళలక ఆమె పట్టుదల, పోరాట పటిమ ఆదర్శం కావాలి అని చెప్పటానికే  ఈ విశ్లేషణ.  ఎవరో  చెప్పారు అని మనకి వాస్తవమా? కాదా ? అని  తెలియని విషయాలు అది ఒక మహిళా గురించి విచక్షణ రహిత అసభ్య పూరిత వ్యాక్యాలు చేసే ముందు  ఇంటి వద్ద తల్లి చెల్లి ఉన్నారు, వారి గురించి అదే విధముగా భయట వారు మాట్లాడితే వారు ఎంతటి  మానసిక క్షోబ కు గురి అవుతారో అనే విషయం ఆలోచిస్తే కన్నా తల్లి జన్మ పరమార్ధం అవుతుంది, జన్మనిచ్చినందుకు అ తల్లి క్షోబించదు.

ఈ చర్యను ఖండించావలిసిన వారి మౌనం ఆమెకు రాజకీయముగా ఇంకా భలము చేకూరుస్తుంది తప్ప ఆశించిన ఫలితం దక్కదు అనే చెప్పాలి.  ఒక్కసారి ఇందిరా గాంధీ గారి రాజకీయ పటిమ గుర్తు చేసుకుంటే మంచిది.



"ఏ పార్టీ కి వ్యతిరేకం కాదు, ఏ పార్టీ కి అనుకూలం  కాదు. "  - క్విక్ ఆంధ్ర 





 Post by

 Quick Andhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement