Skip to main content

దేవుడి సైకాలజి - చీమ చెప్పిన కధ       

చీమ సామాన్యముగా కుడితే మనిషి కి మంటకెక్కుతుంది, తనకి తెలియకుండా మనిషి చెయ్య కుట్టిన ప్రదేశానికి వెళ్ళిపోతుంది, చీమ చస్తే పరవలేదు, చవకపోతే చచ్చే వరుకు దాన్ని నలిపి నలిపి చంపేస్తాము. ఇక్కడ చీమ చేసిన తన కర్మ మనిషిని కుట్టడం దానికి ప్రతి కర్మ నలిగిచావటం.

ఇక్కడ సైన్సు ఏమిటంటే  కర్మ కి ప్రతికర్మ ఉంటుంది. యాక్షన్ - ఆపోజిట్ రియాక్షన్ . ఆస్తికుల విషయం లో దేవుడు అంటే ఒక పెద్ద శక్తి, మనుషులు దేవుడు ముందల ఒక చిన్న జీవి అంటే చీమ అయిన మనిషి అయిన దేవుడి ముందల ఒక్కటే. చీమ మనిషి కి తన కర్మ తో ఎంతటి మంటకేక్కిస్తాదో, అలాగే మనిషి కర్మలకి దేవుడు తగిని ఫలితాన్ని ఇస్తారు.


నాస్తికుల విషయంలో పనే దేవుడు ప్రతి విషయానికి ఏదో ఒక కారణం ఉంటుంది, వారికీ దేవుడి పైన ఎటువంటి విశ్వాసం ఉండదు. సో చేసిన పని యొక్క ఫలాన్ని వారు ఆశిస్తారు. వారు ఏమి చేస్తే దాన్ని ఫలితన్ని ఆశిస్తారు. మంట కలిగించే పని చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఫలితన్ని కూడా విరు అరుహులుగా ఫీల్ అవుతారు.

చీమ కుట్టిన ప్రతిసారి అది నలుగుతుంది అని రూల్ లేదు కొన్ని సార్లు తప్పించుకోవచ్చు, దాన్ని అద్రుష్టం అనుకుంటారు  ఆస్తికులు. కానీ నాస్తికులు చీమ తప్పించుకున్నందుకు గల కారణాలు వెతుకుతారు. కారణాలు ఏమైనా తప్పించుకోవటం అనేది వాస్తవము.

ఇక్కడ దేవుడు ఉన్నాడా లేర అనేది విషయం కాదు, ఆలోచన విధానము, నమ్మకం, మొండి పట్టుదల ఇక్కడ సమాజం పైన చాల తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

గోవధ చేసేవారిని చంపనవసరం లేదు, వారి దగ్గెర గోవు ని  తీసుకోని  వెళ్ళి పెంచుకోవచ్చు.  అసలు అ ఆప్షన్ ఒక్కటి ఉన్నది అనే విషయం మరిచి మనుషులను చంపటం దేవుడు కూడా క్షమించలేని కర్మ.  గోవధ చేసే వారిని భయపెట్టి మార్చాలి అని అనుకోకుండా వారికీ గోవు కి ఉన్న విశిష్టత వివరించి స్నేహ పూర్వక సంధి చేసుకోవచ్చు.

ఇలాగ ఉండాలి ఇలాగ చెయ్యాలి అనేవి నియమాలు,నిబందనలు. అవి మనుషుల నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకపోవడము కూడా ఒక నమ్మకమే, మీరు నమ్మిన, నమ్మకపోయినా ఇది నిజం. గోవుని పవిత్రం గా చూడటం నమ్మకం, కారణాలు ఏమైనా అది ఒక భలమైన నమ్మకం. ప్రాక్టికల్ గా చూస్తే మనిషి జన్మ పెద్ద వరం. కానీ మనిషి జన్మ అంత సులభం కాదు, బాధ్యతలు, బంధాలు, బంధుత్వాలు, జ్ఞాపకాలు ఎన్నో. గోవధ వలన కేవలం ఒక నోరులేని జీవి చనిపోతుంది, అ గోవు ని మనిషితో పోలిస్తే బాధ్యతలు తక్కువ, కానీ మనిషి కి ఉన్న బాధ్యతలు చాల ఎక్కువ.   

సోదరులు కూడా కొంచెం రూట్ మార్చాలి,  అందరము మనుషులమే పవిత్రముగా భావించటము అంటే ఎప్పటి నుంచో సంస్కృతి లో జీర్ణించుకున్న భలమైన నమ్మకం, అటువంటి సున్నితమైన విషయాన్ని వివాదాస్పదం కాకుండా చూసుకోవాలి.

నాయకులు " రుచించే  " మాటలు చెప్పి శాంతి పూర్వకముగా ఉన్న వాతావరణాన్ని ఒక్కసారి గా
గందరగోళ్ళం లోకి తీసుకోని వెళ్లతారు - వారికీ నమ్మకం వారి మాటలు విని మనం మరింత భావుద్రేకలకు గురి అవుతాము అని.  మరి అన్ని మతాలు వారు కలిసి ఉంటె వారి పబ్బం ఎలాగా గడుస్తుంది లెండి.

నేను ఒకటి నమ్ముతున్నాను నువ్వు అది నమ్మాలి, లేదు నువ్వు నమ్మిన విషయం వేరు నేను నమ్మిన విషయం చెప్పుతాను విను అదే నువ్వు నమ్మాలి అనే అంశం పైనే ఇన్ని గొడవలు. అందరు దేవుడుని ఒకటే కోరుకుంటారు అ కోరుకునే విషయం అందరికి తెలుసు,  కానీ ఎక్కడ కి వెళ్ళి కోరుకుంటారు (స్థలం ), ఏ విధముగా ప్రార్దిస్తారు (విధానం , పద్దతి ) అనే ఈ రెండు అంశాల మీద వచ్చిన మనస్పర్ధల వలన వచ్చిన చిక్కుముడి ఇది. కానీ చివరికి అందరు ఒక పాయింట్ దగ్గెర ఆగుతారు దేవుడు అనే అంశం దగ్గెర. పూజించే పద్దతి, విధానం , పేరు మాత్రమే వేరు ప్రార్ధన గమ్య స్థానం ఒక్కటే.

అహం ఉన్న చోట ఏ దేవుడు ఉండడు! కావాల్సివస్తే వారి వారి మత గ్రంధాలు పరిశీలించవచ్చు. అలాగే అందరు కలిసున్నా ప్రదేశం లో పలన మతమే గొప్పది, పలనా దేవుడే గొప్పవాడు అని అనడం కేవలం అహంకారం తో కూడిన వ్యాఖ్యలు, అది ఏ మతమైన ఏ దేవుడు అయిన.  అహంకారం అంటే అంధకారం, అటువంటి వ్యాఖ్యలు చేసావారు అంధకరులుగా పరిగానిన్చాపడతారు.

వారు దేవుడు సేవకులు అని చెప్పుకునే జ్ఞాన హినులగా పరిగానిన్చాపడతారు. సరే మరి గోవుని అంతగా ఇష్టపడేవారు నట్టింట్లో లోనే వాటిని పెట్టుకోవచ్చుగా, బెడ్ రూమ్ లో నిధ్రపుచ్చ్వచ్చుగా పశువుల దొడ్డి లో ఎందుకు కట్టేస్తున్నారు. ఉనికిని చాటుకోవటానికి ఉన్మాద చర్యలు చెయ్యనవసరం లేదు.

ఇంకొకవైపు ఒకరు భక్తీ తో ఒక విషయాన్ని ఆరాధిస్తున్నారు అని తెలుసు - పబ్లిక్ మీటింగ్ లో మీరు తినండి యెంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది అనే వ్యాఖ్యలు. చెప్పినవాడు ఏ.సి రూమ్ లో భాగానే ఉంటాడు కానీ భయటన ఉన్నవారు కొట్టుకొని చావాలి అనే ఆలోచన. కొట్టుకొని చస్తే అ పినుగులతో రాజకీయం చేసి తన ఉనికిని చాటుకోవాలనే ఆశ తో మాట్లాడిన మాటలు. ఏంటి! కాదు అని అంటారా? రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసి జనాలను కొట్టుకొని చావమనే ఉద్దేశం తో చేసిన రాజకీయ మతోన్మదుడి మాటలు వెనుక ఉన్న అంతర ఆలోచన ను గ్రహించలేర మీరు.

దేవుడిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే పనులు చూస్తే, దేవుడు సైకాలజి ప్రకారం వీళ్ళకి మతిస్థిమితం ప్రసాదించి మరి శిక్షిస్తారు. గోవు పవిత్రమైనది వాస్తవమే కానీ గోవధకి  పలుపడేవారికి మరణం అనేది పెద్ద శిక్ష . గోవధ చేసిన వారి ని శిక్షించే విధముగా  కొన్ని చట్టాలు ఉన్నాయి.  అవన్నీ మరిచి తోటి మనిషి పైన భౌతిక దాడి కి దిగి హతమార్చే అంత ఉన్మాద చర్య కి దిగాటాన్ని ఏమంటారు ?

దేవుడిని కూడా తమ రాజకీయ ప్రలోభాలకు వాడుకునే వారిని రాక్షసులు సైతానులు అనకుండా ఉండగలరా మీరు ? ఈ విశ్వం లో ఒక అతిత శక్తి అనేది ఉంది కాకపోతే మేము చేసిన నామకరణం మే కరెక్ట్ అని విభేదించుకోవటం వాళ్ళ ఇన్ని మతాలు పుట్టుకోనివచ్చాయి.

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics