Skip to main content

ప్రోటోకాల్ బ్యాన్ చెయ్యాలి - ప్రోటోకాల్ పేరుతో నిజయతిపరులను అవినీతి రొంపి లో కి!       
నిజాయితి - అవినీతి - ప్రోటోకాల్ : మొదట నిజాయితిగా ఉండి తరువాత అవినీతి పరులుగా  మారిపోయే అదికారుల గురించి మనం చాలాసార్లు  వినే ఉంటాం.  నిజాయితీపరులు అవినీతిపరులుగా పరిణామం చెందడానికి ఒక  ప్రక్రియ జరుగుతుంది. అ ప్రక్రియ లో ప్రధాన పాత్ర పోషించేది ప్రోటోకాల్  (దౌత్య మర్యాదలు, నిర్వహణ నియమాలు) . 

ఒక ఉన్నత అదికారి ఏ ప్రదేశానికి అయినా పర్యటనకి లేదా నిర్వహణ కార్యక్రమానికి వచ్చినప్పుడు, అ జిల్లా అత్యున్నత అదికారి తన క్రింద పని చేసే  అదికారికి  అ ఉన్నత అదికారికి మర్యాదలు చెయ్యటానికి మార్గదర్శకాలు సూచిస్తారు అదే ప్రోటోకాల్ .

 రెండవ రకం : భాష  మర్చి చెప్పాలి అంటే వచ్చిన ఆఫీసర్ మంచి వాడు అయితే అతని తిండి, నీరు వగైరాలు అతనే తెచ్చుకొని ఎవరిమీద భారం పడకుండా చూస్తాడు. అదే రెండవ రకం వాడు  అయితే  వాడు మందు కావాలి అంటే మందు , విందు కావాలి అంటే విందు ఇంకేమైనా కావాలి అంటే అవి కూడా క్రింద స్థాయి అధికారులు చూసుకోవాలి. ఇందుకు గవర్నమెంట్ ఎటువంటి ప్రత్యేక నిధులు కేటాయించదు కేటాయించినా అవి వాళ్ళని మేపటానికి సరిపోవు. 

వెదవ బిరుదు : నెలకి  ఐదుగురు మేతగాళ్ళని నెలకి ముప్పయివేలు వచ్చే ఉద్యోగి ఎలాగా మేపగలడు ఆలోచించండి.! ఆ వెదవలని (అందరు కాదు ప్రోటోకాల్ పేరుతో పందులులా తిని దున్నల్లా త్రాగి క్రింది స్థాయి అదికారులను అవినీతి రొంపిలోకి దింపే వెదవలకి మాత్రమే "వెదవలు " అనే బిరుదు ఇవ్వడం జరిగింది ) .

ఇలాగ వీళ్ళని మేపటానికి, ఈ క్రిందిస్థాయి ఉద్యోగులు వారు నిజయితిగా చేసే పనిని ప్రక్క తోవ పట్టించి, అక్రమ సంపాదన అర్జించేవారి సహాయం పొందాలి. అంటే చెయ్యి చాచాలి! 


ఒక కధ, కధ కానీ కధ ఇది : ఒక నిజాయితీ పరుడు అయిన ఉద్యోగి , నేను నిజయితిగా ఉండాలి, ఉంటాను అని నిర్ణయించుకొని తన మొదటి రోజు ఆఫీసులో  అడుగు పెట్టాడు. నాలుగు నెలల తరువాత ఆయినకి తన ఉన్నత అధికారి నుంచి ఒక ఉత్తరువు వచ్చింది. దాని సారంశం ఏమిటి అంటే, ఈ జిల్లాకి వచ్చే ఉన్నత అదికారులు, బడా నాయకుల ప్రోటోకాల్ బాధ్యత మీకు అప్పచెప్పాము అని . అలాగని వచ్చే వాళ్ళని  మేపటానికి  అతనికి ఎటువంటి ఫండ్స్   మంజూరు చెయ్యలేదు.

అంటే ఆ అదికారి ఎవడు వచ్చినా ప్రోటోకాల్ కోసం తన జీతం  మొత్తం వెచ్చించాలి.. అయినా సరిపోదు. వచ్చిన గొట్టంగాడికి మర్యాదలు  తక్కువైతే పైన ఉన్న గొట్టంగాడు ఈ అధికారి మీద సీరియస్ అవుతాడు లేదా సస్పెండ్ చేస్తాడు, బదిలీ  చేస్తాడు లేదా ఇంక్రిమెంట్ తగ్గించే సూచనలు లేకపోలేదు.

ఇటువంటి ఒత్తిడిలో అ ఉద్యోగి ఏం చెయ్యాలి, ఆ  వచ్చినవాడిని మేపటానికి సంఘంలో పెద్ద మనుషులు,  సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతూ  హుందాగా చలామణి అయ్యే వారి దగ్గర చేతులు చాచాలి.

మరి డబ్బు తీసుకున్న తరువాత ఇచ్చిన వాడు కాళీగా  ఉంటాడా ! "సంతక" "లా" వ్యాపారం జరుగుతుంది. 

ఇటువంటి రొచ్చులో ఇరుక్కుపోయిన  పైన తెలిపిన అదికారి ప్రస్తుతం కాలం చేసారు అనేది సమాచారం!  అ పుణ్యానికి పునాది వేసింది ప్రోటోకాల్, అ ప్రోటోకాల్ ఉత్తర్వులు ఇచ్చిన వెదవకు తెలియదా !!!! అనే ఆవేశం తో కూడిన మాటలు మా చెవిన పడినవి. 

ప్రోటోకాల్ ఎందుకు ? అవసరమా ? ఒక ఉద్యోగి మరో ఉద్యోగికి మర్యాదలు చెయ్యటం ఏమిటి ? భారత రాజ్యాంగం ప్రకారం అందరు సమానమే కదా ! సరే డిగ్నిటి అఫ్ లేబర్ దేశానికీ ఆవసరమా ? 

క్రింది స్థాయి అదికారులని లోబర్చుకోవటానికి ప్రోటోకాల్  అనేది  ఒక తిరుగులేని ఆయుధం. 

అవినీతి మూలం :  భారత దేశానికీ స్వాతంత్ర్యం  వచ్చిన తరువాత అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ వ్యవస్థల పైన కొన్ని ఆంక్షలు విధించారు లైసెన్స్ (అనుమతి ). ఇప్పటి లాగా ఎవరు పడితే వారు కంపెనీ లు పెట్టడానికి కుదరదు - టూత్ పేస్టు తాయారు చేసే  కంపెనీలు పరిమితిలో ఉంటె చాలు అనే సిద్ధాంతంతో అంతకమించి అనుమతులు ఇచ్చేది కాదు అప్పటి ప్రభుత్వం. దేశ ప్రజలు నెలకి      100 టన్నుల టూత్ పేస్టు వాడితే  అంతవరకే సరుకు తయారు చెయ్యాలి అనే నిర్ధారణకు రావటం, అమలు పరచటం జరిగేది. ప్రజలుకు ఏ మేరకు కావాలో అంతవరకే సప్లై ఉండాలి అనేది అప్పటి ఆలోచన. అప్పుడు నాసిరకం సరుకులు ,  కాలం చెందిన సరుకులు మార్కెట్ లో ఉండవు. అలాగే ఫ్యాక్టరీలకు లైసెన్స్ పొందాలి  అంటే ఏంటో కష్ట సాధ్యం .  ప్రైవేట్ రంగం కూడా ప్రభుత్వ అదుపాజ్ఞలలో నడిచే విదముగా పక్కా ప్రణాళిక రూపొందించి ప్రవేశ పెట్టారు. నిర్దేశించిన ఉత్పత్తికి మించి ఉత్పత్తి చెయ్యకూడదు, చెయ్యాలి అంటే ప్రభుత్వ అనుమతి కావాలి. 

అలా కావాలి అంటే సంబందిత అదికారుల దగ్గరనుండి  పర్మిషన్ కావాలి, ఈ పర్మిషన్ తేవటానికి, చూసి చూడకుండా ఉండటానికి ఒక మధ్యవర్తి వ్యవహారం చేసిన వారికీ కొంత ముట్ట చెప్పాలి అదే ఆధునిక భాషలో కమీషన్, కన్సల్టెంట్ ఫి - సామాన్యుడి భాషలో లంచం- అవినీతి.  


 ఈ వ్యవస్థ దేశం లో ప్రతి మూలకి వ్యాప్తి చెందింది. మరి కొన్ని మూలాలతో మరి కొన్ని వస్తావ ఘటనలతో మళ్ళి మీ ముందుకు వస్తాము .........కొనసాగుతుంది  Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics