ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

పశ్చిమగోదావరి జిల్లా దళారి నాయకులతో అధికారులు మరియు నష్టపోయిన మొక్కజొన్న రైతులు జరా భద్రం :



       దళారి నాయకులతో  అధికారులు మరియు నష్టపోయిన  మొక్కజొన్న రైతులు జరా భద్రం :


నష్టపోయిన మొక్కజొన్న రైతులు కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంట నష్ట పరిహారం చెల్లించడానికి అధికారులకు సూచనలు ఇచ్చి ఉన్నారు . అయితే కొంత మంది దళారీ  రాజకీయ నాయకులు ఈ పధకాలు ప్రజలు వరుకు చేరాలి అంటే ముందు తమ ఇంటి వద్దకు రైతులు హాజరు కావాలి అని చెప్పి, అధికారులు తమ చేతిలో మనుషులు అని రైతులను మభ్య పెట్టి, వేరొక విషయం పైన అధికారులు తమతో మాట్లాడటానికి రావాలని  గౌరవపూర్వకముగా ఆహ్వానించి ఇటు రైతులను అటు అధికారులను మభ్య పెట్టె కార్యక్రమాలు చేస్తున్నారు అనేది సమాచారం.
ఒక వేళా  ఇలాగ చేస్తే కనుక అధికారులు మీరు అ దళారుల చేతి లో మనుషులుగా చరిత్ర లో మిగిలిపోతారు, వారు ఎటువంటి అవకతవకలకు పాలుపడిన దాని లో మీకు కూడా ఎంతో కొంత భాగం ఉంది అని ప్రజలు విశ్వసించే విధముగా అ దళారులు మీ నిజాయితి మీద ప్రచారం చేస్తారు.

అలాగే నిజంగా నష్టపోయిన  రైతులు లబ్ది పొందలేరు. అ దళారి  నాయకుల ఇంటికి వెళ్లి మీరు నష్ట పోయిన  రైతుల పేరు నమోదు చేసుకోవచ్చు అనే ఆలోచన  వారు మీకు కలిగిస్తే జరా భద్రం ! వారు వారి బీనమిల పేర్లు నమోదు చేయిస్తారు నిజంగా నష్టపోయిన రైతు దృష్టి లో ప్రభుత్వం తమకి ఏ విధముగా ఉపయోగ పడలేదు అనే అభిప్రాయంలోనే ఉండి పోతారు! మన ముఖ్య మంత్రి గారు  రైతు లను ఆదుకోవాలని అనే ఈ పధకం లో అవకతవకలు జరిగితే దాని లో మీకు కూడా భాగస్వామ్యం ఉంటుంది.

టముకు వేయించి బహిరంగ ప్రకటన ఒకటి ప్రకటించి, పలాన రోజున,పలాన బహిరంగ స్థలమున లేక ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయమునందు  మేము అధికారముగా వచ్చి నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకుంటున్నాము అని చెప్పితే అప్పుడు నష్ట పోయిన నిజమైన రైతులు  భయటకు వస్తారు మిమ్మల్ని ఆశ్రయిస్తారు .

అంతే కానీ స్థానిక రాజకీయ దళారి నాయకుడు ఇంటి వద్దకు అయన టి త్రాగటానికి పిలిచారు అని చెప్పి వెళ్లి మీరు కూర్చుంటే, ఇంకేముంది అ అధికారి నా జేబులో మనిషి, నేను ఎంత  చెప్పితే అంతే అని కల్లెక్షన్లు మొదలపెడతారు అప్పుడు చెయ్యని తప్పు కి మీరు, పధకాలు నిజమైన లబ్ది దారుడి కి చేరకుండా ప్రభుత్వం అపవాద మోయ్యవలిసి ఉంటుంది.








 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement