ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఎస్ .సి ఎస్ .టి చట్టన్ని సవరణ ఎందుకు చెయ్యలేకపోతున్నారు అనే ప్రశ్న ఎందుకు అడగలేకపోతున్నారు ? చెక్కు బౌన్సు చట్టం లో ప్రభుత్వానికి కుదిరిన చట్ట సవరణ ఈ విషయం లో ఎందుకు కుదరటం లేదు ?



       
పూర్వం గౌరవనీయులైన సుప్రీమ్ కోర్టు వారు చెక్ బౌన్సు కేసుల లో కొన్ని మార్పులు చేకూరుస్తు సామన్యుడు ఈ చట్టం క్రింద కార్పొరేట్ వ్యవస్థ చేతిలో  బలి అవుతున్నాడు అనే విషయం గ్రహించి కొన్ని మార్పులు చేసారు. అయితే అ మార్పులలో ఒకటి  ఏమిటి అంటే చెక్కు ఇచ్చిన వ్యక్తీ నివాసం ఉన్న  కోర్టు పరిధి లోనే అ చెక్కు తాలుక కంప్లైంట్ ఫైల్ చెయ్యాలి , అంతే కానీ చెక్కు తీసుకున్న వ్యక్తీ ఉన్న ప్రదేశం లో నుంచి కాదు అని.

కొన్ని కార్పొరేట్  ఫైనాన్సు సంస్థలు ముంబాయి లో ఉండి ఇక్కడ రాజముండ్రి లో ఉన్న వ్యక్తీ పైన చెక్కు బౌన్సు  ఫిర్యాదు చేస్తే అతను రాజముండ్రి నుంచి ముంబాయి తిరగవలిసిందే లేదే వాయిద కి  వెళ్ళకపోతే నాన్ బెయిల్ బుల్ వారెంట్ పైన వుసాలు లెక్క పెట్టలిసిందే. ఈ బలవంతపు వసులన్ని అడ్డుకోవటానికి సుప్రీమ్ కోర్ట్ వారు సామాన్యులకు రక్షణ కలిపించే ఉద్దేశం తో కొని మార్గ దర్శకలు సూచించారు.


అప్పుడు ప్రభుత్వం  వెంటనే ఒక సంవత్యర వ్యవధి లో చెక్కు బౌన్సు (NI Act) చట్టాన్ని సవరించడం జరిగింది(కోర్టు వారి మార్గ దర్శకలకు వ్యతిరేకంగ). ఎటువంటి రివ్యూ పిటిషన్ దాఖలు చెయ్యకుండ. ఈ సవరణ కార్పొరేట్ వ్యవస్థలకు చాల లబ్ది అనే విషయం అందరికి తెలిసిందే.

ఒక్కసారి ఆలోచించడి ఇప్పుడు    ఎస్ .సి ఎస్ .టి ప్రేవేన్షణ్  అఫ్   అట్ట్రోసిటి  చట్టన్ని ఎందుకు అని సవరించే ప్రయత్నం చెయ్యడం లేదు అనేది ప్రశ్న ?

అప్పుడు కార్పోరేట్ వ్యవస్థలకు ఉపయోగపడిన చట్ట సవరణ ,     ఎస్ .సి ఎస్ .టి ప్రేవేన్షణ్  అఫ్   అట్ట్రోసిటి  చట్టన్ని సవరించే విషయంలో ఎందుకని ఉపయోగపడటం లేదు అనేది ప్రశ్న?

చట్ట సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అయిన అ విషయం పైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది ? ఎందుకని ఇంత మంది మనోభావాలు దెబ్బ తింటున్న సవరణ నిర్ణయం తీసుకోవడం లేదు ?

ఆలోచించండి ప్రశ్నించవలిసిన ప్రతి విషయం ఆలోచించండి - ప్రతి ఆలోచనకు  ప్రశ్నను సంధించండి   సమాధానం మీకే దొరుకుతుంది.









 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement