ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆమె పడిన వేదనకి ఏ శిక్ష కి అ ఉన్మాదులు అర్హులు



     
 ఎనిమిది సంవత్సరాల వయస్సు ! ప్రపంచం గురించి ఏ మాత్రం తెలియని పసి మొగ్గ ! కనీసం అ దుర్మార్గులు దేని కోసం ఆమెను అపహరించారో తెలుసుకోలేని అమాయకత్వం ! ఆమె పడిన వేదన , తన శరీరం మీద తన ప్రేమేయం లేకుండా , అసలు జరిగేది ఏంటో తెలియకుండా, ఆమె ను ఇష్టమొచ్చి నట్టు కొడుతూ, ఆమె ఎప్పుడు వినని దుర్బషలడుతూ, భయం భయం గా , ఇకనైన వదులుతారు లే , ఇకనైన వదులుతారు లే అనే ఆశ తో, దేవుడా నన్ను ఈ దుర్మార్గుల భారి నుంచి కాపాడు అని తన మనసులో తనే ప్రార్దన చేసుకుంటూ, నన్ను కొట్టకండి, నన్ను ఏమి చేస్తున్నారు , నన్ను వదిలెయ్యండి మీకు దండం పేడత  అని అర్తనర్ధాలు చేస్తున్న ఆమె ను వదలకుండా 8 సంవత్యరాల అ పసి పిల్లను  భాలత్కారం చేసి చంపేసినప్పుడు ఆమె పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి, ఆమె పడిన మనోవేదన ?

       జరిగన దాని గురించి బాధ పడాల ? ఇంకా జరగబోయే వాటి గురించి అలోచించి భయపడాల ?
భారత దేశం లో ప్రతి మహిళకు భద్రత కల్పించటం సాధ్యమేనా అనేది ప్రశ్న ......ఆలోచించవలిసిన ప్రశ్న ? ఎందుకంటే  రేప్ చెయ్యడం అనేది ఒక ఉన్మాద చర్య - ఉన్మాది చట్టలుకు - చట్టలలోని శిక్షలకు భయపడతాడ అనేది ప్రశ్న .  

     కాంగ్రెస్ హయం లో "నిర్భయ " - "బి జే పి" హయం లో అసిఫా అనేది ప్రశ్న కాదు - ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చిన భారత దేశం లో స్త్రీ కి మాత్రం రక్షణ లేదు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారితే స్త్రీ లకు రక్షణ ఉన్నదా ? లేదా అనేది ప్రశ్న ? చట్టలలో  శిక్షలు తీవ్రత పెంచిన స్త్రీల పైన జరిగే దాడులు అపగాలుగుతున్నారా లేదా అనేది ప్రశ్న ?

      ఆడపిల్ల కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి ట్యూషన్ కి పంపించే విధముగా వాణిజ్య ప్రకటనలు విడుదల చేసి తమ సరుకు అమ్ముకునే పరిస్థితి లో వాణిజ్య సంస్థలు,   భారత దేశం లొ  ఉన్నాయి అంటే మన దేశం లో స్త్రీ కి ఉన్న రక్షణ గురించి తలెత్తే ప్రశ్న   ఆలోచించండి ?


      ఎన్ని పార్టీ లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన స్త్రీ కి రక్షణ లేదు అనే విషయంలో ఇక్కడ స్పష్టత ఏర్పడుతుంది అనే విషయం ఒక్కసారి అలోచించి అ ఆలోచనకి ప్రశ్న సందిస్తే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది.  ప్రస్తుతం ఒక ఎనిమిది సంవత్సరాల చిన్న పిల్ల  పడిన మనోవేదనకు మరియు శారిరిక హింస కు అలాగే ఆమె మరణానికి  మాత్రం సమాధానం ఖచ్చితంగా చెప్పవలిసిందే.  ఏమి చేస్తే స్త్రీ కి రక్షణ ఏర్పడుతుంది అనేది ప్రశ్న ? ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు వారికీ పెప్పర్ స్ప్రే ఇచ్చి స్కూల్ కి పంపించావలిసిన పరిస్థితి భారత దేశం లో ఏర్పాడింద అనేది ప్రశ్న? ఏమి చేస్తే వ్యవస్థ లో మార్పు వస్తుంది అనేది ప్రశ్న ? 

    
            







 Post by

 Quickandhra Independent Web Media Publication in association with progressive young leaders association

Advertisement