ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్ - తహసిల్దారు అంటే హోదా కాదు రా బాబు అది బాధ్యత ! అ బాధ్యత ని హోదా క్రింద భావించే ముందు ని బాధ్యతలు ఏమిటో తెలుసుకో "వింత ఉద్యోగి "



    ఒక మనిషి కి ఎన్ని అవయవాలు ఉంటాయో  ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్ కి అన్నే ఉంటాయి  ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండవు, సామాన్యముగా మనిషి కి ఎరుపు రంగులో ఉండే రక్తం ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్ కి పచ్చ గానో లేదా తెల్లగానో ఉండదు వారికీ కూడా రక్తం " ఎరుపు " రంగు లోనే ప్రవహిస్తుంది - ఇక్కడ గుర్తుంచుకోవలిసిన విషయం ఏమిటి అంటే ప్రభుత్వం ఒక వ్యక్తిని ప్రజలకు సేవ చెయ్యడానికి పనికి వస్తాడు అని "భావించి " అతని అర్హతను బట్టి ఒక ఉద్యోగం ఇస్తుంది కానీ హోదా కాదు అనే విషయం తెలుసుకోలేని చాల మంది వారి ఉద్యోగాన్ని హోదా క్రింద పరిగణించి సామన్యుడు కి  "సేవ" అనే పధం మరిచి అధికార దురహంకారం ప్రదర్శించడానికి కారణం ఏమిటి అంటారు ?



   ప్రజసేవకుడి గా ఉండి, నేను నడిస్తే బంటు వస్తాడు, నేను సంతకం చేస్తేనే పాస్ బుక్ లు వస్తాయి, నేను సంతకం చెయ్యకపోతే చాల పరిణామాలు ఉంటాయి  అని ఆలోచించే వారికీ హోదా దక్కుతుందేమో కానీ మర్యాద కాదు.  అక్కడ సరైన విచారణ చేసి అన్ని పనులు సక్రమంగా చెయ్యడానికి, ప్రజలకు  ప్రభుత్వం నుంచి ఒక సేవకుడు కావాలి కాబట్టి ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్ -  తహసిల్దారు  అనే ఉద్యోగం.

  తప్పు ని ఖండించటానికి! ప్రజల పక్షం నిలపడటానికి, ప్రజల కోసం పోరాడటానికి, ప్రజల కోసం ప్రభుత్వం తరుపున పని చెయ్యడానికి ఒక ఉద్యోగం - వచ్చిన ప్రతి వాడికి నేను ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్  ని అని ఒక   తహసిల్దార్ కార్యాలయం లో చెప్పుకుంటే వచ్చేది మర్యాద కాదు ! "వింత  ***  " అనే  భావన.

  ఒక వ్యక్తీ సమాచార హక్కు చట్టం ప్రకారం అర్జి నమోదు చేసుకుంటే (పబ్లిక్ ప్రాపర్టీ ని ఆక్రమించుకున్నారు అనే విషయం పైన ) అతనికి తప్పుడు సమాచారం  అందించిన ఒక తహసిల్దార్ కార్యాలయం వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి , సమాచార హక్కు చట్టం వివరించి చెప్పిన ,  సమాచార హక్కు చట్టం గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా నేను ఒక   ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్  నన్ను ప్రశ్నించటం ఏమిటి అని సమాధానం చెప్పిన  ఒక "వింత ఉద్యోగి" కి తెలియవలిసిన విషయం  ఏమిటి అంటే  మీకు ఉద్యోగాలు ఇచ్చేది ప్రజలకు సేవ చెయ్యడానికి, అలాగే మీరు మీ  బాధ్యతలు విస్మరించినప్పుడు రాజ్యాంగం ప్రజలకు ప్రశ్నించే హక్కు ఇచ్చింది.  అది తెలుసుకోలేని  మీ లాంటి కొంత మంది "  వింత    ఉద్యోగులు " బాధ్యతను హోదా గా భావించి ప్రజలను ఇబ్బంది పెట్టటం  వళ్ళ మన దేశంలో సమాంతర పోరాటం చేసేవాళ్ళని   ని అశ్రయించ వలసిన పరిస్థితి వస్తుంది.

    అందరి ఉద్యోగులను గురించి కాదు పాఠకులారా ! కేవలం బాధ్యతను హోదా క్రింద భావించే  ఉద్యోగి గురించే ఈ ఆర్టికల్, త్వరలో మీకు సాక్ష్యలు తో పైన తెలిపిన విషయం పైన ఆధారాలతో కూడిన ప్రచురణ ప్రచురిస్తాము.


 Quote " గౌరవం హోదాను బట్టి రాదు - నడుచుకునే విధానం, బాధ్యతో కూడిన వ్యవహార శైలి తో  వస్తుంది "












 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement