ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆపరేషన్ గరుడ మీద ఆలోచింప చేసే ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి ?



       

ప్రత్యక హోదా తప్పనిసరిగా కావలిసిందే అది ప్రతి యొక్క ఆంధ్రుడి హక్కు ఈ విషయం లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎలక్షన్ కి ఒక సంవత్యరం ముందల ఈ అంశం పైన చర్చ పోరాటం కొంచెం ఆలోచింప చేసే విషయం.  సరే ఇప్పటికి వరుకు వారు కరునిస్తారు అని వేచి ఉన్నాం అనే అంశం కూడా ఆలోచించవలిసిన విషయమే. 

కానీ ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి విషయం, చేసే ప్రతి పని ప్రజలు వింటున్నారు చూస్తున్నారు. మనకోసం ఏదో చేస్తున్నారు అనే భావన ప్రజలలో కలిగిస్తున్నారు. ఇటువంటి సమయం లో "నటుడు"  శివాజీ ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యి ఆపరేషన్ "గరుడ" అని ఒక చర్చనీయమైన " అంశాన్ని " తేర మీదకి తీసుకోని వచ్చారు. ఈ అంశం తో రాష్ట్రం లో ప్రత్యక హోదా గురించి చర్చలు పక్క దారి పట్టి అసలు  విషయం మరుగునపడి పోతుంది అనే విషయం లో ఎటువంటి సంకోచం లేదు. 

ఈ విషయం పైన కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా నాయకుడు మామిళ్ళపల్లి వసంత రావు గారు సామజిక మాధ్యమాలలో కొన్ని ప్రశ్నలు వేసారు .....అ ప్రశ్నలు ఏమిటి అంటే 


దక్షిణాదిలో అధికారం కోసం ఆపరేషన్ ద్రవిడ ఆంధ్ర తెలంగాణాలలో ఆపరేషన్ గరుడ కర్నాటకలో ఆపరేషన్ కుమార తమిళనాడు కేరళలలో ఆపరేషన్ రావణ పేర్లతో బిఙేపీ కుట్ర చేస్తోందని సినీ హీరో శివాజీ సంచలన సమాచారం వెల్లడించాడు.


మరి సిబిఐ సెంట్రల్ విఙిలెన్సు కమీషన్ స్టేట్ ఇంటిలిఙెన్సు స్పెషల్ బ్రాంచ్ సిఐడి విఙిలెన్సు గూఢచారి శాఖలు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియని కుట్ర సమాచారం హీరో శివాఙికి ఎలా తెల్సింది?


ఆయనకేమైనా ప్రైవేటు గూఢచారి వ్యవస్థ ఉన్నదా? 

ఆయన్ని కేంద్ర సిబిఐ రాష్ట్ర సిఐడి పోలీసు తక్షణం విచారించాలి.
తెలుగు ప్రఙలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందనే భయాందోళనలు కల్గించటం వెనుక ప్రత్యేక హోదా అంశం మరుగు పర్చటానికే టిడీపి పన్నిన వ్యూహాన్ని హీరో శివాఙీ అమలు మొదలు పెట్టాడని నా అభిప్రాయం.
ప్రత్యేక హోదా సాధన సమితిలో ఇతను టిడీపి కోవర్టు అని నా అనుమానం.
ఇలాంటి కుట్ర సమాచారాన్ని బహుశా మొన్న బిజేపీ నుండి బయట కొచ్చిన బిఙేపీ ఙాతీయ సోషల్ మీడియా 
అధ్యక్షుడు ప్రద్యుత్ బోరా టిడిపీ చెవిని వేసి ఉంటాడనటంలో ఎలాంటి సందేహం ఉండ నక్కర్లేదు.
దీనిని హీరో శివాఙి ద్వారా టిడీపి ప్రచారంలో పెట్టిందన వచ్చు.
అందుకేనేమో తాను వెల్లడించే సంచలన సమాచారం తన ప్రమేయంతో జరుగుతుందని సాధన సమితికి సంబంధం లేదని శివాఙీ ఈ రోఙు ఉదయం చెప్పింది.
-- --
అయన ప్రశ్నించిన విషయాలలో 
1. మరి సిబిఐ సెంట్రల్ విఙిలెన్సు కమీషన్ స్టేట్ ఇంటిలిఙెన్సు స్పెషల్ బ్రాంచ్ సిఐడి విఙిలెన్సు గూఢచారి శాఖలు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియని కుట్ర సమాచారం హీరో శివాఙికి ఎలా తెల్సింది?
విశ్లేషణ :
నిజమే కదా మరి స్పెషల్ బ్రాంచ్ సి ఐ డి విజిలెన్స్ గూఢచారి శాఖలు లకు తెలియని విషయాలు " నటుడు " శివాజీ కి ఎలాగా తెలిసింది. ఖచ్చితంగ ఈ విషయం పైన పోలీస్ వారు కానీ, సిబిఐ వారు కానీ విచారణ జరపాలి ఎందుకంటె "నటుడు " శివాజీ చెప్పిన విషయాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రధాన ప్రతిపక్ష నేత మీద చేస్తున్న కుట్ర గా పరిగణించవచ్చు.      

2.ఆయనకేమైనా ప్రైవేటు గూఢచారి వ్యవస్థ ఉన్నదా?  ఆయన్ని కేంద్ర సిబిఐ రాష్ట్ర సిఐడి పోలీసు తక్షణం విచారించాలి.

విశ్లేషణ  :  ఆలోచింప చేసే ప్రశ్న ఎందుకంటె "నటుడు" శివాజీ, "నటుడు" గూడచార వ్యవస్థ లో అతనికి అణువంత అనుభవం కూడా లేదు అనే విషయం అందరకి తెలిసన విషయమే మరి అయన చెప్పిన " గరుడ " " అంశం " రాష్ట్ర  అంతర్గత భద్రత కి సంభందించిన విషయం  అలాగే దేశం రాజకీయ భవిష్యత్తు ను నిర్దేశించే విషయం. పాఠకులు ఒక్కసారి ఆలోచించండి .........మీ ఆలోచనని ప్రశ్నించండి సమధానం మీకే దొరుకుతుంది.    

   అలాగే వసంతరావు రావు గారు అయన అభిప్రాయం ఈ విధముగా వ్యక్త పరిచారు


3. తెలుగు ప్రఙలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందనే భయాందోళనలు కల్గించటం వెనుక ప్రత్యేక హోదా అంశం మరుగు పర్చటానికే టిడీపి పన్నిన వ్యూహాన్ని హీరో శివాఙీ అమలు మొదలు పెట్టాడని నా అభిప్రాయం.

విశ్లేషణ : ప్రజల లో  ఇలాంటి  విషయాలు చర్చించి వారిని  భయాందోళనలు కలిగించటం  అనేది చిన్న విషయం కాదు  , ఒక ముఖ్యమంత్రి మీద కుట్ర జరుగుతుంది అనే విషయం "నటుడు"  శివాజీ "క్లైమాక్స్ " తో సహా వివరించారు. అంటే అయన దగ్గెర ఎంత సమాచారం లేక పోతే అయన ఈ విధముగా ఒక స్థానిక పేరుపొందిన మీడియా సంస్థ ముందలకి  వచ్చి  "గరుడ" అంశాన్ని వెలికి తీస్తారు. అయన దగ్గెర ఉన్న అధరాలు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి చాల ఉపయోగం, రాష్ట్రానికే కాదు దేశానికీ కూడా చాల ఉపయోగం.       
ఒక వేళా ఈ విషయం లో సత్యం లేకపోతే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశం మరుగున పడటం వినాయకుడు పాలు త్రాగినంత, అది ఒక మంత్రి చూసినంత  వాస్తవం.



ఆలోచింప చేసే ప్రతి విషయం పాఠకులకే వదిలేస్తున్నాము .....కానీ ఆలోచన చేసే సమయములో మీ ఆలోచనకి ప్రశ్న ని సంధించండి సమధానం అదే దొరుకుతుంది.
 




 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement