ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

క్రైమ్ నెంబర్ 26/2005 లోని చిదంబర రహస్యం ఇదే - చింతలపూడి మండలం రాఘవాపురం నీటి సంఘం లో జరిగిన అవినీతి ఫైల్ - గెలుపు-ఓటములు పక్కన పెడితే అవినీతి పైన అలుపు ఎరగని పోరాటం చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మేము సెల్యూట్ చేస్తున్నాము



       
ఫార్మర్స్ మెనజేమేంట్ అఫ్ ఇరిగేషన్ (A.P.F.M.I.S) చట్టం 1997 ప్రకారం యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల   నీటి పారుదల వ్యవస్థ  లో  పనితీరు కి జవాబు దారి తనము ఉండాలి అని. ఇందు నిమిత్తం ఈ చట్టం లో సెక్షన్ 17 కింద నిటి వినియోగదారుల సంఘం యొక్క పని తీరుని సూచించడం జరిగింది. సబ్ సెక్షన్ K క్రింద వనరులు సమకూర్చుకోవటం అలాగే సబ్ సెక్షన్ L కింద ప్రతి రూపాయి కి లెక్క చూపాలి మరియు సబ్ సెక్షన్ M క్రింద ప్రతి సంవత్యరం ఆడిట్ నిర్వహించాలి ఇవి నీటి వినియోగదారుల సంఘం లో ముఖ్య మైన పాత్రా పోషిస్తాయి.

అయితే సదరు గుత్త వెంకటేశ్వర రావు గారు   చింతలపూడి  మండలం , రాఘవాపురం గ్రామం W.U.A., T.A.L.S ఛానల్  కి  నీటి సంఘం అధ్యక్షుడిగా  గా పని చేసారు, అ సమయంలో ఆయన  ఎటువంటి ఆడిట్ చూపించలేదు , అయితే ఇరిగేషన్ డిపార్టుమెంటు వాళ్ళు ఎన్నో సార్లు వివరణ కోరగా   1997 -98, 98-99, 99-2000, 2000-2001 మరియు 2002 కి, మే 2002 న చెల్లింపులు మరియు రసీదులు ఛార్టర్డ్ అకౌంటెంట్ తో ఆడిట్ చేయ్యించారు. అ ఆడిట్ రిపోర్ట్ లో "ఎంకులు " రూ.4,41,293/- నీటి పన్ను క్రింద  డైరెక్ట్ గా రెవిన్యూ డిపార్టుమెంటు నుంచి డి.డి.నెంబర్  445572, ది: 08-03-2001, డి.డి.నెంబర్ 497731, ది:08-11-2001 మరియు 635095, ది.31-01-2002 ను రూ.32,416/-, రూ.1,11,985/- మరియు రూ.2,96,892/- ను ఫసలి నెంబర్ 1409 మరియు 1410 కు గాను దొర గారు తీసుకున్నారు. ఇలాగ చేసినందుకు గాను  రూల్స్ ప్రకారం అప్పుడు రాఘవాపురం ఆంధ్రాబ్యాంక్ నీటి వినియోగదారుల సంఘం తుంబురి అనికాట్ ఎడమపక్క ఛానల్ యొక్క బ్యాంకు ఎకౌంటు నెంబర్ 3275/7 లో రూ.4,41,293/- ఉండాలి . ఈ నిధులని కేవలం ఛానల్ యొక్క నిర్వహణ కు దానిని మైంటైన్ చెయ్యటానికి వాడాలి అలగే అత్యవసర పరిస్థితులలో ఈ సొమ్ముని వాడాలి. ఈ నిధులని ఇంకా వేరొక పని కోసం వాడాలి అంటే దాని నిమిత్తం సంభందిత  అధికారుల దగ్గర ముందుగ అనుమతి పొందాలి. అలాగా చెయ్యకపోతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చెయ్యడమే.

అలాగే సంబందిత అధికారులకి నిధులు ఖర్చు చేసే విషయంలో చాల పరిమితులు ఉంటాయి, అసిస్టెంట్ ఇంజనీర్ కి రూ.50000/- వారుకు , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి రూ.50000/- నుంచి రూ.100000/- వారుకు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి రూ.100000/- .

పైన చెప్పిన రూ.4,41,293/- ఇరిగేషన్ డిపార్టుమెంటు వారు ఎటువంటి పని నిర్వహణకి సదరు "ఎంకులు " గారికి ఆమోదం ఇవ్వకుండానే ఈ  రూ. 4,41,293/- రెక్కలు వచ్చి ఎగిరి పోయాయి. లెక్క ప్రకారం అప్పటిలో ఈ నిటి పన్ను సొమ్ము నీటి వినియోగదారుల సంఘం యొక్క  ఆంధ్ర  బ్యాంకు ఎకౌంటు లో ఉండాలి. కానీ ఈ సొమ్ము ఎందుకు ఖర్చు చేసారో చెప్పటానికి సరైన లెక్కలు చూపలేదు, అ సొమ్మును నిటి వినియోగదారుల సంఘం కోసం ఖర్చు చేసినట్టుగాని, లేదా డిపార్టుమెంటు వారు ఆమోదించిన పనుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగానీ లెక్కలు చూపించలేదు. ఇందు నిమిత్తం లెక్కలు చూపించమని ఎన్నో అవకాశాలు ఇచ్చిన తరువాత కూడా నిటి వినియోగదారుల  ప్రెసిడెంట్ లెక్కలు చూపించలేదు.

ప్రజలు  యొక్క డబ్బు కాపాడుకోవడానికి డిపార్టుమెంటు (ఇరిగేషన్ డిపార్టుమెంటు ) వారు సదరు ప్రెసిడెంట్ గారి మీద  చింతలపూడి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చారు.

ఇవన్ని మా సొంత కవిత్వాలు కాదు అండి  wp No.2809/2005 లో అప్పటిలో కోమర్తి వరహాలు, నూకయ్య అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు హై కోర్టులో  లో దాఖలు చేసిన కౌంటర్ లో క్లుప్తముగా నిధులు దుర్వినియోగం జరిగాయి అని ఒక అఫ్ఫీడవిట్ ఇచ్చారు. వారు వారి అఫ్ఫీడవిట్ లో క్షుణ్ణంగా చెప్పింది ఏమిటి అంటే నిటి పన్ను సొమ్ము    రూ. 4,41,293/-  లెక్కలు లోకి రాలేదు, అవి ఎందుకు ఖర్చు చేసారు అనే లెక్క తేలలేదు ఈ విధముగా చేస్తే ఫార్మర్స్ మెనజేమేంట్ అఫ్ ఇరిగేషన్ (A.P.F.M.I.S) చట్టం 1997 ప్రకారం నేరం అని అలాగే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 409 కింద అది నేరం అని నిర్ధారణకి వచ్చిన తరువాత అప్పటి ప్రెసిడెంట్ మీద చింతలపూడి మండలం, చింతలపూడి పోలీస్ స్టేషన్  లో కేసు పెట్టారు.       

ఈ విషయం పైన సదరు ప్రెసిడెంట్ గారి మీద అప్పటి ఇరిగేషన్ డిపార్టుమెంటు వారు ఫిర్యాదు చేసారు,  అప్పటి నిటి వనరుల వినియోగదారులు సంఘం ప్రెసిడెంట్ గారు వెంటనే తన  పైన పెట్టిన కేసు ల  మీద అప్పటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ వారిని తన మీద ఉన్న కేసులు క్వాష్ చెయ్యమని అలాగే ఇన్వెస్టిగేషన్ అపివేయ్యాలి అని పిటిషన్ దాఖలు చేసుకున్నారు. గౌరవనియులైన హై కోర్ట్ వారు కేసు లో ముద్దాయి ని అరెస్ట్ చెయ్యటం తప్ప పూర్తి ఇన్వెస్టిగేషన్ చెయ్యమని ఆదేశించారు.
క్రైమ్ నెంబర్ 26/2005 వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యం -
అలాగా ఇరిగేషన్ డిపార్టుమెంటు వారు పెట్టిన  కేసు క్రైమ్ నెంబర్ 26/2005 క్రింద రిజిస్టర్ అయ్యింది. 2006 నాటికీ సదరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఫైనల్ రిపోర్ట్ వేసి కేసు ని క్లోజ్ చేసారు .

సెక్షన్ 409 ఇండియన్ పీనల్ కోడ్ ఏమి చెప్పుతుంది అంటే  ప్రజసేవకుడు లేదా బ్యాంకర్ , వ్యాపారి లేదా ఏజెంట్ అతని అధినంలో ఉన్న  నిధులని  పైన  క్రిమినల్ ఉల్లంఘన  చేస్తే వారికీ జీవిత ఖైదు లేదా పది సంవత్యరలు శిక్ష అని వివరిస్తుంది.

అయితే ఈ విషయంలో పోలీస్ వారికీ ఫిర్యాదు చేసింది ఇరిగేషన్ డిపార్టుమెంటు. సి.పి.ఐ పార్టీ తరుపున ఈ కేసు లో అవకతవకలు జరిగాయి అని గ్రహించిన మామిలిపల్లి వసంత రావు అసలు ఏమి జరిగింది అని ఇరిగేషన్ డిపార్టుమెంటు వారికీ సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక అర్జి పెడితే వారు చెప్పిన వివరాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. శ్రీ గుత్త వెంకటేశ్వరావు గారు APFMIS ACT 1997 క్రింద నడ్చుకోలేదు అనే చెపుతున్నారు కానీ డబ్బులు దుర్వినియోగం అవ్వలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. పోలీస్ వారు FIR నమోదు చేసి తమ "చర్యలును ఉపక్రమించారు" - మళ్ళి చెప్పుతున్నాం పోలీస్ వారు FIR నమోదు చేసి తమ "చర్యలును ఉపక్రమించారు"

ఈ కేసు అంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద బేస్ అయ్యి ఉంది, బ్యాంకు రికార్డ్లు లు, ఇంజనీర్స్ యొక్క స్టేట్మెంట్లు, అఫ్ఫీడవిట్ లు,  ఆడిట్  మరియు డి.డి నెంబర్ ల తో సహా అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో కుడి  ఉన్నాయి. EX ఇంజనీర్ కూడా తన  అఫ్ఫీడవిట్ లో పూర్తి వివరం పొందు పరిచి నిధులు APFMIS ACT 1997 విరుద్దంగా డ్రా చెయ్యబడ్డవి అని క్షున్నగ చెప్పి యున్నారు. మరి అంత హడావిడిగా కేసు క్లోజ్ చెయ్యవలసిన అవసరం పోలీస్ వారికీ ఎందుకు వచ్చింది. అక్కడ ఎంతటి రాజకీయ వ్యూహం రచిస్తే ఈ రకంగ కేసు క్లోజ్ అయ్యింది అనే విషయాన్ని పాఠకులకే వదిలేస్తున్నాము. సదరు అప్పటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారు నిధులు దుర్వినయోగం కాలేదు అనే వివరణ ఇచ్చారు మరి నిధులు దుర్వినియోగం అవ్వకుండా APFMIS ACT 1997 విరుద్దంగా నిధులు ఎలాగా  డ్రా  చేయబడ్డాయి. అ రూ. 4,41,293/-  లెక్కలు లోకి రాకుండా ఎక్కడకి ఎగిరి పోయాయి. సదరు అప్పటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి అత్యుత్యహంగా హై కోర్టు వారు కేసు డిస్మిస్ చేసారు అని తెలియ చేసారు, అసలు గౌర్వనియులయన హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిందే గుత్త వెంకటేశ్వర రావు, అతను వేసుకున్న పిటిషన్ ను డిస్మిస్ చేసారు అనే విషయం చెప్పకుండా మాటలు వక్రీకరించడం లో అంతరార్దం పాఠకులకే వదిలేస్తున్నాం. అసలు       గౌర్వనియులయన హై కోర్ట్ అ పిటిషన్ ఎందుకు డిస్మిస్ చేసారు అంటే సదరు పోలీస్ వారు తమ చర్యలను వెనక్కి తీసుకోవడం వలెనే అని స్పష్టంగా ఆర్డర్ లో ద్రువికరించారు.

మరి ఇరిగేషన్ డిపార్టుమెంటు వాళ్ళు ఇచ్చింది ఫాల్స్ రిపోర్ట్ అయితే  కేసు క్లోజ్ చేసిన పోలీస్ లు మళ్ళి సెక్షన్ 192 ఇండియన్ పీనల్ కోడ్ కింద  తప్పుడు రిపోర్ట్ ఇచ్చిరు అని భావించిన  ఇరిగేషన్ డిపార్టుమెంటు మీద  కేసు ఎందుకని పెట్టలేదు - ఎందుకని పెట్టలేదో , అక్కడ ఏమి జరిగి ఉంటాదో  అనే ఆలోచన మొత్తం పాఠకులకే వదిలేస్తున్నాం.

 ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు దాఖలు చేసిన కౌంటర్ లో 9 వ పేరా లో ఇలాగ చెప్పారు వెంకటేశ్వర రావు గారు APFMIS ACT 1997 లో ఉన్న నిభందనలు నాకు తెలియుదు అని చెప్పారు , కానీ ఆయన అలాగా చెప్పటానికి విలు లేదు అని చెప్పారు. ఈ విషయం లో కూడా పాయింట్ ఉంది ఇండియన్ పినల్ కోడ్ లో మిస్టేక్ అఫ్ లా మరియు మిస్టేక్ అఫ్ ఫెక్ట్ అని రెండు కోణాలు ఉన్నాయి మిస్టేక్ అఫ్ లా నేరం అని చెపుతుంది, అయితే APFMIS ACT 1997 అనేది చట్టం మరి చట్టం లో వివవరాలు నాకు తెలియదు అని చెప్పి తప్పించుకోవటం నేరమే కదా!

అదే పేరా లో అయన ప్రజలు సొమ్మును అనధికారంగా  ఉపయోగించారు అని క్లుప్తము వివరముగా వెల్లడించారు. అయన తన అఫ్ఫీడవిట్ లో 15 వ పేరా లో మా డిపార్టుమెంటు సైడ్ నుంచి క్లియర్ గా ఉంది టెక్నికల్ గా ఎటువంటి పనులకు నిర్వహణకు నిధులు సాంక్షన్ లేదు అని చెప్పి. ఒక వేళ అలాంటి పనులు చేస్తే దాని తాలుక ఏం.బుక్స్ అనే వాటిలో రికార్డు మైంటైన్ చెయ్యాలి, అ ఏం. బుక్ లు ఇవ్వమని డిపార్టుమెంటు కోరగా అ బుక్స్ కూడా డిపార్టుమెంటుకు చూప లేదు అని అయన క్షుణ్ణంగా చెప్పారు. ఇందు కోసం డిపార్టుమెంటు వారు పంపించిన నోటీసు తీసుకోని 10 రోజులు అయిన అయన ఎటువంటి ఎకౌంటు పొందుపరచలేదు అని. అప్పటి రాఘవాపురం  అసిస్టెంట్ ఇంజనీర్ పోలీస్ వారికీ రిపోర్ట్ పోస్ట్ ద్వార పంపించారు అని 16వ పేరా లో వివరించారు.

మరి అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వారు ఈ విషయం పైన ఎంక్వయిరీ ఎందుకు చెయ్యలేదు?   అ ఆలోచన పాఠకులకే వదిలేస్తున్నాం. గౌర్వనియులయిన  హై కోర్టు లో , ఈ కేసు కి సంబంధించి  చాలామంది ఇరిగేషన్ డిపార్టుమెంటు కి సంభందించిన ఆఫీసుర్లు  నిధులు దురువినియోగం చేసారు , మా సేనక్షన్ లేకుండానే నిధులు వాడుకున్నారు అని అఫ్ఫీడవిట్ లు సమర్పించారు మరి - ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారి పరిధిలో అవి సాక్ష్యాలు కదా అనే ఆలోచన కూడా పాఠకులకే వదిలేస్తున్నాం.

LETTER NO. DCE-II/OT4/SO3/WG/05 DT - 06-10-2005 చెప్పుతుంది ?

ఈ రిపోర్ట్ ప్రకారం నియమితులైన ఎంక్వయిరీ ఆఫీసర్ ఇలాగ తెలియ చేసారు

ఏ పని అయిన చేసే ముందల W.U.A ప్రెసిడెంట్ ముందలగా సంబంధిత అధికారుల దగ్గెర అనుమతి పొందలి. రిసల్యుషణ్ మీటింగ్ లో కూడా సంభందిత అధికారుల సంతకాలు లేవు, వాళ్ళు వారి స్వంతముగా సంబంధిత అధికారి అనుమతి మరియు డిపార్టుమెంటు అనుమతి లేకుండా వ్యవహరించారు, ప్రెసిడెంట్ సదరు అధికారి అనుమతి లేకుండా తన స్వంతానికి నిధులు వాడినందువలన దానికి గవర్నమెంట్ సొమ్ము చెల్లించనవసరం లేదు అని. అ  రూ,4,41,293/-  రూపాయులు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా తీసుకోని వాడినట్టే అని ద్రువికరించారు.

ఈ లెటర్ సారంశం ఏమిటి అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా సంఘం బ్యాంకు ఎకౌంటు లో డబ్బులు తీసుకుంటే అది ప్రెసిడెంట్ అయిన ఇంకెవరు అయిన అ సొమ్ము గవర్నమెంట్ లెక్కలలోకి రాదు, తప్పకుండ అ సొమ్ము గవర్నమెంట్ కి చేల్లిన్చావలసిందే. అలాగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఫండ్స్ విత్ డ్రా చేస్తే అది నేరమే. ఈ విషయం ప్రభుత్వ ఉద్యోగి ఎవరిని అడిగిన చెప్పుతారు, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి మాత్రం ఎందుకు అర్ధం కాలేదు, దాని వెనుకటి మర్మం ఏమిటి అనే విషయం పాఠకులకే వదిలేస్తున్నాం. 
మరి అప్పటి సదరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఇవన్ని ఎందుకని పట్టించుకోలేదు, అక్కడ ఏమి జరిగి ఉంటుంది అనే ఆలోచన కూడా పాఠకులకే వదిలేస్తున్నాం.

నీతి ఉన్న ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది, ఎంక్వయిరీ రిపోర్ట్ లు సాక్ష్యాలు కదా?,  ఇంజనీర్ లు ఇచ్చిన రిపోర్ట్ , అఫ్ఫీడవిట్ లు సాక్ష్యాలు కదా ? అంటే రాజకీయంగా  యెంత వత్తిడి ఉండి ఉంటె పోలీస్ వారు ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసి ఉంటారు ........అనే ఆలోచన పాఠకులకే వదిలేసాము. గౌరవ నియులైన హై కోర్ట్ వారు కేవలం పోలీస్ వారు దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్ మీదనే కేసు డిస్మిస్ చేసారు. కేసు ని ఎవరు నీరు కార్చారు అనే విషయాన్ని కూడా పాఠకులకే వదిలేస్తున్నాము.

మరి ఇది కోర్టు  ని ప్రజలని మోసం చెయ్యడం కదా ?

ఇదే పని సామన్యుడు చెయ్యగలడ ? చేసి ఇంత సులభంగా తప్పించుకోగలాడా ?

నోటి తో చెప్పిన విషయాలని సాక్ష్యాలుగా సేకరించి కేసు విచారణ చేసి కోర్ట్ కి హాజరుపరిచే పోలీస్ వారు, ఇంత రికార్డు ఉన్న ముద్దాయి పైన చర్యలు విరమించడానికి కారణాలు ఏమిటి ?

మరి జగన్మోహన్ రెడ్డి కేసు కి ఈ కేసు కి తేడ ఏమిటి ?

ప్రభుత్వం అనుమతి లేకుండా నిధులు వాడుకోవడం అనేది ప్రభుత్వ నిధులను దుర్వినయోగం చెయ్యడం కదా?

అయితే ఇక నుంచి ప్రభుత్వ అధికారలు ప్రభుత్వ నిధుల వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండానే  రాజకీయ నాయకుడి హోదా లో నిధులు మొత్తం ఇష్టం వచ్చిన పనికి వాడుకోవచా ?

ఈ స్వాతంత్ర  భారత దేశం లో సామాన్యుడు ఇదే పని చేస్తే ఇంత సులభంగా తప్పించుకోనిస్తారా?

అంటే అధికారం పదవి ఉన్నవాడే ఇక్కడ దొంగ అయిన దొరలగ తిరగవచ్చ ?

సంపాదన కోసం రాజకీయమ ? రాజకీయం కోసం సంపాదన ?

నిజయతిగా పని చేసి రిపోర్ట్ ఇచ్చిన ఆఫీసీర్ యొక్క నిజయతిని నిర్ధక్ష్యముగా ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండా పూడ్చి పడేసారు అని అనుకోవాలా లేదా ?

బ్యాంకు ఎకౌంటు లో ఎకౌంటు హోల్డర్ అనుమతి తీసుకోకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే నేరం ...... అదే ప్రభుత్వ నిధులను ప్రభుత్వ అధికారి అనుమతి లేకుండా తీసుకుంటే నేరం కదా ?

తాగి బండి తొలి దొరికితేనే కనీసం 24 గంటల జైలు శిక్ష - అదే ప్రభుత్వన్ని మోసం చేసి దర్జాగా తిరిగే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే ఆలోచన కూడా పాఠకులకే  వదిలేస్తున్నాం ?

అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా ? క్రిమినాలజి అనే ఒక సబ్జెక్టు ఉంటుంది దాని ప్రకారం ఒక దొంగ దొంగతనం చేసి దొరికి తప్పించుకుంటే వాడు మానసికంగా ధృడంగా ఓహ్ ఇంతేనా అని మరొక దొంగతననికి పునుకుంటాడు - మరి ఒక్కసారి ప్రభుత్వ సొమ్ము అనధికారంగా వాడుకొని తప్పించుకునే నాయకుల పరిస్థితి ఏమిటి అనే ఆలోచన కూడా పాఠకులకే వదిలేస్తున్నాము.

మరి ఇరిగేషన్ డిపార్టుమెంటు లో నిజయతిగా పని చేసే ఉద్యోగులు ఒక అవినీతి  పై చేసిన అలుపెరగని  పోరాటం లో ఏ విధముగా నిరుత్యహానికి గురి అయ్యారు అనే విషయం  పక్కన పెడితే - అయ్యా మీరు గెలిచారు నేను మీ ఎంక్వయిరీ రిపోర్ట్లో అన్ని విషయాలు క్షున్నగా పరిశీలించాను - మీ అలుపు ఎరగని పోరాటానికి నేను మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుతున్న, మీకు సెల్యూట్ చేస్తున్న - గెలుపు ఓటములు పక్కన పెట్టండి. మీ లాంటి వాళ్ళు సమాజానికి చాల అవసరం - చాల అంటే చాల - మీ కష్టాన్ని భారతీయ పౌరిడిగా నేను గుర్తించాను. దయ చేసి నిరుత్యాహ పడకండి మీ లాంటి వాళ్ళు సమాజానికి కావాలి. మీకు మనస్పూర్తిగా నమస్కారం.

సర్ మేము పోరాడతము - గెలుపు ఓటములు పక్కన పెడితే చట్ట పరంగా ఈ అవినీతి మీద పోరాడటానికి సిద్దంగా ఉన్నాము -

అలోచన కలిగింప  చేసే  ప్రతి  విషయాన్ని   పాఠకులకే వదిలేస్తున్నాం ........ ఇలాగ జరిగింది అని మీ దృష్టి కి తిసుకోనివచ్చ్హము  , మా భావాలూ వ్యక్త పరిచము . మేము ఎవరిని దూషించడం లేదు - జరిగిన విషయాన్ని క్లుప్తంగా పరిశిలించి వివరాలు పొందు పరుస్తున్నాము. ప్రజాస్వామ్యం లో ప్రజలే రాజులు - మీకు అర్ధమైతే చాలు  ఏమి జరిగింది అని.

యుద్ధం పాండవులు కోరుకోలేదు కృష్ణుడు కోరుకోలేదు - యుద్ధం చెయ్యవలసి వచ్చింది -www.Quickandhra.com

తరువాత  ఆర్టికల్ లో
నెక్స్ట్ ఏంటి ? తరువాత ..........ఇంకొక .......?









 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement