Skip to main content

అజీర్తి కి ఆయుర్వేద చిట్కాలు1.ఒక టి చెంచాడు (5 మీ.లి) అల్లము రసములో కొద్దిగా పాత ముద్ద బెల్లము కలుపుకొని తిన్న అజీర్ణం తగ్గుతుంది .ఈ మందు శరీరంలో కలుగు దద్దుర్లు, దురద కూడా తగ్గిపోవును.

2.ఇంగువ, మిరియాలు, జీలకర్ర, శుంఠీ మరియు వాము ఈ ఐదింటిని సమానభాగాములుగా తీసుకోని చూర్ణము చేసుకొని ఉంచుకోవాలేను. ఇందులో ఇంగువ నేతిలో వేయించి కలపవలెను . ఈ చూర్ణము కంద మొదలగు దుంప కూరలలో, మరియు సాంబారు లో చిటికెడు వేసిన వండిన కుర పదార్దములు తొందరగా ఉడుకును. అంతే కాక అవి సులభముగా జీర్ణం అవును.
    
౩.50 మీ.లి నిమ్మకాయ రసంలో 15 గ్రాముల జీలకర్ర, 15 గ్రాములు సైంధవ లవణము మరియు 30 గ్రాములు అల్లం ముక్కలు (చిన్నవి) వేసి 3 గంటలు నాన పెట్టవలెను. ప్రతి రోజు ఉదయము పరగడుపున 1 లేక 2 చిన్న అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర తినుచుండున అన్ని రకముల అజిర్ణములు తొలిగిపోయి మంచి అఖలి అవుతుంది. ఈ విధముగా వరం రోజులు తీసుకోని ఆపివేయొచ్చు.

4. ఒక చిన్న ముల్లంగి దుంప ముక్కను కొద్దిగా ఉప్పు అద్దితిని పొట్ట బరువు, త్రేనుపులు తగ్గిపోవును.

  Post by

 Quickandhra Independent Web Media Publication

Articles

Politics

Crime

National Politics

International Politics