ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

దంత వ్యాధులు ఆయుర్వేద చిట్కాలు



       
పండ్లు కదులుట, చీము కారుట, పండ్ల నుండి రక్తం కారుట, పండ్లలో క్రిములు ఏర్పడుట మొదలగునవి నోట్లో ఏర్పడు సాధారణ సమస్యలు.

చికత్యలు:
1. దంతములు కదులుట మరియు చిగుళ్ళ వాపు : బ్రష్ చేసిన తరువాత కొద్దిగా నువ్వుల నూనెను దంతములకు చిగుళ్ళకు నిత్యం పట్టించడం వలన చిగుళ్ళ నుంచి చీము కారుట, పండ్ల నుంచి క్రిములు హరించి కదులుతున్న దంతములు గట్టిపడును. ఒక చెంచాడు నువ్వుల నూనెను నోటిలోకి తీసుకోని 4,5 నిమిషములు పుక్కిలించుట కూడా చెయ్యవచ్చును.
2. వేపకర్రలను , తుమ్మ కర్రలను కాల్చి చేసిన బొగ్గును మెత్తటి చూర్ణము చేసి, అ చూర్ణంతో పళ్ళు తోముకున్న, పళ్ళ వాపులు, చిగుళ్ళ వాపులు తగ్గి దంతములు ప్రకాశించును.
3.నిరుల్లిపాయలు మెత్తగా నూరి, అ ముద్దతో బ్రష్ ని ఉపయోగించి తోముకున్న అన్ని రకముల దంత వ్యాధులు హరించును.
4.పసుపు కొమ్మును నిప్పు పైన కాల్చి చేసిన బొగ్గును మెత్తగా చూర్ణము చేసి ఆ చూర్ణము తో పళ్ళు తోముకుంటే అన్ని రకముల దంత వ్యాధులు హరించును.
5. ప్రతి నిత్యం ఒక చెంచాడు నల్ల నువ్వులు బాగుగ నమిలి తిని, చల్లటి మంచి ననీళ్ళు త్రాగుతు ఉంటె దంతములు కి బలము కలిగి గట్టిగ ఉండును.
పరిమితులు : పన్ను నెప్పి వలన తల నెప్పి కలగవచ్చు. పన్ను పైన కలకన్ను పచ్చిచేసిన వెంటనే దంత వైద్యున్ని వెంటనే సంప్రదించాలి.

ఈ వెబ్ సైట్ సమాచార పొందు పరుచుటకు ఒక వేదిక, పాఠకులకు ఈ చిట్కాలు పాటించమని చెప్పడం మా ఉద్దేశం కాదు, నిపుణులు ని సంప్రదించకుండ మీరు ఎటువంటి ప్రయోగాలూ చెయ్యవద్దు 







 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement