ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఉపిరితిత్తుల కాన్సెర్ రావడానికి గల కారణాలు, సంకేతాలు, నిర్ధారించటం , వైద్యం

ఉపిరితిత్తులు అనగా ఏమిటి ?
మానవ శరీరంలో ఉపిరితిత్తులు అనేవి ఒక అవయవం. మనము వీటిని శ్వాస తీసుకోవడానికి ఉపయోగించుకుంటాము. ఈ అవయవములు పనిచేయుటకు మనకు ప్రాణవాయువు కావాలి. ఉపిరితిత్తులు ప్రాణవాయువును పీల్చుకుంటాయి.

ఉపిరితిత్తులు క్యాన్సర్ రావడానికి గల కారణాలు ?
  • పొగ త్రాగటం వలన 
  • అస్ బేస్ టాస్ (ఇంటి పైన కప్పుకునే సిమెంట్ రేకులు ) వంటి రసాయనాలు 
  • ఏ కారణం లేకుండా 

ఉపిరితిత్తుల క్యాన్సర్ గల సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి ?
  • నిరంతర /ఎడతెగని దగ్గు మరియు పొగ త్రాగడం వలన వచ్చే దగ్గులో మార్పు
  • దగ్గినప్పుడు వచ్చే కఫంలో రక్తం పడుట ( ఎరుపు రంగులో లేక ముదురు ఎరుపు రంగులో )
  • శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు (బరువుగా ఉపిరి తీసుకోవడం )
  • శ్వాస తీసుకునేటప్పుడు ఛాతి భాగములో చిన్నపాటి నొప్పి మరియు అలసట 
  • శరీరం మొత్తం మీద నొప్పులు, విపరీతమైన అలసట, నీరసంతో సాధారణముగా బాధపడుట
  • ఆకలి మరియు బరువు తగ్గిపోవుట 
ఉపిరితిత్తులు క్యాన్సర్ ఎలా నిర్ధారించగలము ?
ఇలాగ నిర్ధారించగలము
  • ఛాతి ఏక్స్-రే
  • రక్త పరిక్షలు 
  • కఫం పరీక్ష (మైక్రోస్కోపు ద్వార ఉమ్ములో క్యాన్సేర్ సెల్లులను గుర్తించటం )
  • బ్రాంకోస్కోప్ ద్వార (ఒక సన్నని వంగిన ట్యూబ్ టెలీస్కోప్ లాగా శ్వాసకోశములోనికి ప్రవేశించబడును) మిడియాస్టినోస్టమి.
  • సి.టి.స్కాన్
  • ఎముకుల స్కాన్
వైద్యం
ఈ క్రింది వాటిలో ఒకటైన లేక మూడు కలిపి
  • సర్జరీ 
  • రేడియోధేరపి
  • కిమోధేరఫి   




Advertisement