ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

బిజెపి కాంగ్రెస్ కి జిరాక్స్ కాపీ నే!

 
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అలాగే భారతీయ జనత పార్టీ కూడా జాతీయ పార్టీ నే. కానీ ఆంధ్రప్రదేశ్ విషయములో ఈ రెండు పార్టీ లు వైకరి ఒక్కటే. 
కాంగ్రెస్ పార్టీ అప్పటిలో హడావిడిగా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం చేసింది. విభజించటం వాళ్ళ నష్టం లేదు కానీ హడావిడిగా విభజించటం వాళ్ళ జరిగిన నష్టమే ఎక్కువ.


కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ స్వార్ధం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలిపశువు క్రింద వాడుకున్నది అని చెప్పటానికి ఏ మాత్రం ఆలోచించనవసరం లేదు. అయితే ఎందుకు అలాగా చేసారు అంటే తెలంగాణా పైన పట్టు కోసం అనే చెప్పాలి . ఆంధ్రప్రదేశ్ లో వై.యస్.ఆర్  కాంగ్రెస్ ని తన అదుపాజ్ఞలలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ని శాసించాలి అనేది ఒక ఉద్దేశం అయితే, టి ఆర్ ఎస్ పార్టీ ని విలీనం చేసుకొని తెలంగాణా రాష్ట్రంలో బలపడటం ఇంకొక ఉద్దేశం.  కానీ కే.సి.ఆర్ కాంగ్రెస్ ఆలోచనలని చెప్పుతో కొట్టినట్టు గా రాజకీయ వ్యూహం రచించారు. రాష్ట్రం విభజించే వారుకు తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అని చెప్పి అ తరువాత ప్యుహాత్మకముగా రాజకీయ వ్యవహరించారు. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ కి మూలిగే నక్క మీద తాటి కాయ పడినట్టు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం గెలిచింది. 

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరి అయ్యింది. తన గుర్తింపు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ కన్నా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితే మెరుగు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మోడీ ఆంధ్రప్రదేశ్ పైన చూపిస్తున్న వివక్ష కారణముగా తెలుగు దేశం పార్టీ  ఆంధ్రప్రదేశ్ లో  ఎదురు లేని పార్టీ క్రింద తయ్యారు అవ్వుతుంది.

ఇంకా బిజెపి పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తో మాకు పని ఏమి ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో పక్క దేశం అనే విధముగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కు ఒక విధముగా నష్టం చేకురిస్తే, బి జే పి మరొక విధముగా నష్టం చేకూరుస్తుంది.  ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి  విభజన చట్టం ప్రకారం ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ అవి అన్ని పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ నే అనే చిన్న విమర్శ చేసి చొక్కా దులుపుకొని మరి విషయాన్ని పక్కదారి పట్టించారు. 

కాంగ్రెస్ పార్టీ కి కానీ, బిజెపి పార్టీ కి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనవసరం అలాంటప్పుడు ఈ రెండు పార్టీ లు ఆంధ్రప్రదేశ్ విషయములో జిరాక్స్ పార్టీలు కాకుండా ఎలాగా ఉంటాయి !              








 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement