ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి మండలం ఒక్క గ్రామం లో జరిగిన అవకతవకల విలువ 2,865,000/- - ప్రజల ప్రాణాలు ఎంతకి తాకట్టు పెట్టారు అనే విషయం తెలియాలి ?



       

క్విక్ ఆంధ్ర  ఇంటర్నెట్ డెస్క్ :  ఒక సీనియర్ విలేఖరి , ప్రజసేవకుడు చెప్పిన మాటలు మరొకసారి  గుర్తుచేసుకుంటూ ఈ అవినీతి గురించి మాట్లాడుకుందాం ! ఒకప్పుడు ఎవరు అయిన అవినీతి కి చేస్తే ప్రజలు “ అంత అవినీతి పరుడ “ అనే ఆలోచనతో ఉండేవారు ! ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యం లోన అయిన నాణ్యత పరిణామాలు లేకపోతే అసలు ఉపెక్షేంచే వారు కాదు ! కాలం మారుతున్న కొద్ది మన మానసిక స్థితి ఎలాగా మారిపోయింది అంటే ! అః తింటే తిన్నడులే  ఏదో ఒక పని చేసి పెట్టాడు కదా ? దానిలో నాణ్యత ఉన్నదా ? లేదా ? మనకి అనవసరం అనే వైఖరి లోకి వెళ్ళిపోయాము మనం. కానీ అక్కడ తినేది మనం టాక్స్ రూపం లో కట్టే సొమ్ము అని ! అది ప్రజల సొమ్ము అని మరిచిపోయి అవినీతి చేసినవాడు గొప్పవాడిగ సత్కరించే స్థాయికి మన విలువలు పడిపోయినవి ! ఎందుకు అంటే ! అది చేతకాని తనం కాదు , మనకెందుకు లే అనే నిర్లక్ష్యం.


విషయానికి వద్దం ……! స్వచ్చ భరత్ భారత దేశ మహిళల యొక్క గౌరవ మర్యాదల దృష్టి లో ఉంచుకొని తలపెట్టిన పధకం. అయితే ఈ పధకంలో అవకతవకలు జరుగుతున్నాయి అనే ఉద్దేశం తో కొన్ని మార్గదర్శకాలు సూచించి వాటిని బట్టి బాత్రూమ్ కి అయ్యిన ఖర్చు కాంట్రాక్టర్ లేదా  అ వ్యక్తి ఎకౌంటు లోకి డిపాజిట్ చేస్తారు. అ గైడ్ లైన్స్ ఏమిటి అంటే బోర్డు అఫ్ సేనేటరి ఆఫీసర్ (BSO) ఒకరిని అప్పాయింట్ చెయ్యాలి అతను /ఆమె కడుతున్న బాత్రూమ్ యొక్క నాణ్యత పరిమాణాలు పర్యవిక్షించి ఒక రిపోర్ట్ తాయారు చెయ్యాలి, ఫిసికల్ వెరిఫికేషన్ చెక్ రిపోర్ట్ ఒకటి తాయారు చెయ్యాలి, అలాగే నాణ్యత గా కట్టార లేదా అనే విషయం పైన  క్వాలిటీ చెక్ రిపోర్ట్ తాయారు చెయ్యాలి, ఒక శాంపిల్ క్వాలిటీ చెక్ రిపోర్ట్ తాయారు చెయ్యాలి ఇవ్వి పూర్తి అయ్యిన తరువాత, బాత్రూం ఫోటోలు తలుపు తెరిచి లోపల బెషిన్ , మరియు బాత్రూమ్ లో అమర్చిన పరికరాలు అన్ని కనపడే విధముగా లబ్దిదరుడి ఫోటో తో కూడిన మొత్తం ఫైల్ పంపిస్తే అప్పుడు కాంట్రాక్టర్ కి బిల్ చెయ్యాలి.


అయితే క్విక్ ఆంధ్ర కు ఇక్కడ జరిగిన అవినీతి మీద కొంత వరుకు  నమ్మకమైన సమాచారం వచ్చింది. మూడు వారాలు విరమం లేని ఇన్వెస్టిగేషన్ చేసి ఒక గ్రామానికి సంబంధించిన వివరాలు సేకరించము 191 IHHL బాత్ రూమ్స్ ఫోటో లో తో సహా సేకరించం. అయితే మాకు దొరికిన వివరాలలో మేము తెలుసుకున్న విషయాల ప్రకారం వారు పెట్టిన చిత్రాల ప్రకారం బిల్లు లు ఆమోదించాకుడదు కానీ ప్రతి ఇంటికి 15000 రూపాయల వరుకు ఆమోదించారు (దయ చేసి ఎవిడెన్స్ టెంపర్ చేసి మరొక నేరం చెయ్యకండి నా దగ్గెర ఫైల్ ఉన్నది ).


సరే అసలు పైన స్థాయి అధికారులకు తెలిసి ఈ విషయం జరిగిందా అనే సందిగ్ధ లో ఉన్న మేము సమాచార హక్కు చట్టం క్రింద ఒక దరఖాస్తు చేసాం, భారతీయ ఉన్నత పదవిలో ఉన్న ఒక ఐ ఏ ఎస్ అధికారి మా అర్జి కి స్పందించి సంభందిత అధికారి వద్దకు వెళ్లి అ సమాచారం పొందవలిసిందిగా, అ అధికారి వారు సమాచారం పొందు పరచవలసింది గా సూచనలు ఇచ్చాము అని ప్రత్యుతరం వ్రాసి ఉన్నారు.


పైన స్థాయి అధికారి నిజాయతి పరుడు అనే విషయం అర్ధయమయ్యింది, ఇంకా క్రింద స్థాయి అధికారుల గురించి తెలియాలి ఏలూరు లో ఉన్న మెయిన్ ఆఫీస్ కి వెళ్లి పైన తెలిపిన   ఐ ఏ ఎస్ అధికారి యొక్క సూచనలు చూపించి వివరాల కోసం ఎప్పుడు రావాలి అని అడిగాను. మేము మీ మండల స్థాయి అధికారులకు విషయం తెలిపాము, వారు మాకు వివరాలు పొందు పరచగానే మీకు వెంటనే వివరాలు అందిస్తాము అని చెప్పారు. ఇప్పటికి 30 రోజులు గడిచి 8 వ రోజు కానీ ఎటువంటి వివరాలు అందించలేదు. కొన్ని రోజుల క్రిందట పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారికి ఫోన్ చెయ్యగా వారు చెప్పింది ఏమిటి అంటే నలుగు గ్రామాలు వివరాలు కదండి టైం పడుతుంది అని అంటున్నారు చింతలపూడి సంబంధిత అధికారి  అని, నేను వెంటనే "సర్ మీ నోటీసు కి తీసుకోని వస్తున్న అసలు బాత్రూమ్ లు కట్టేటప్పుడు వారు అవి తాయారు చెయ్యాలి ఇప్పుడు కాదు అని" - నాకు అర్ధమయిన విషయం ఏమిటి అంటే క్రింద స్థాయి అధికారులు ఎందుకో సమాచారం ఇవ్వకుండా కావాలని జాప్యం చేస్తున్నారు అని……. అసలు నిజంగా రిపోర్ట్ లు ఉంటె ఎందుకు జాప్యం చెయ్యాలి …….జరిగిన విషయం లో విరి పాత్రా ఏమైనా ఉందా ?


ఒక ఉరి 191X15000 = 2,865,000/-  ఒక గ్రామం IHHL బిల్ ప్రభుత్వ సొమ్ము ఇలాగ మా పరిధి లోకి వచ్చింది  నలుగు గ్రామాలలో అవినీతి జరిగింది.


నాణ్యత పరిమాణాల లేకుండా చేసిన నిర్మాణాల వల్ల జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు ? ప్రజల ప్రాణాలు ఎంతకి తాకట్టు పెట్టారు ?


రెండు రోజులలో ఏదో ఒక రోజున సాక్ష్యాలు పొందుపరుస్తం వీక్షించండి

ఈ విషయం పైన తప్పకుండ న్యాయ పోరాటం చేస్తాం కానీ అంతక ముందల ప్రజలకు ఏమి జరిగింది అనే విషయం తెలియాలి కదా !

"సమాజం లో ప్రతి అవినీతి మీద నేను పోరాడలేకపోవచ్చు - కానీ నా దృష్టి లో కి ఏ ఒక్క విషయం వచ్చిన - దానికి చిన్న సాక్ష్యం దొరికిన - నేను వెనుతిరగను - నిశబ్ధముగా ఉండటం అంటే వ్యక్తిత్వం మర్చుకున్నాటు కాదు "








 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement